/rtv/media/media_files/2025/10/26/elderly-couple-brutally-murdered-2025-10-26-13-02-02.jpg)
Elderly couple brutally murdered
Crime News: కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామంలో వృద్ధ జంట హత్య కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. నాగప్ప(60), ఓబులమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే ఓబులమ్మ ఉండగానే పెద్దక్క అనే మహిళతో సుమారు 30 ఏళ్లుగా నాగప్ప సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరూ తాడిపత్రి రహదారిలో, పెద్ద పసుపుల మోటులో ఇటుకల బట్టీలు నడుపుతున్నారు. వీరిద్దరూ తాడిపత్రిలో రహదారిలోని ఇటుకల బట్టీ వద్దే నివాసముంటున్నారు. ఓబులమ్మ తన ఇద్దరు కుమారులతో జమ్మలమడుగు పట్టణంలో ఉంటున్నారు.
ఆదివారం ఉదయం నాగప్ప, పెద్దక్క తాడిపత్రి రహదారిలోని ఇటుకల బట్టీలో నిద్రించారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు రోకలి బండతో వారిద్దరి తలలు పగలగొట్టి హతమార్చారు. పక్కనే ఉన్న గదిలో బీరువాలో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆ వృద్ధ జంట దగ్గర సొత్తును ఎత్తుకెళ్లారు. ఇది దోపిడీ దొంగల పనే అని స్థానికులు భావిస్తుంటే.. నేర స్థలిలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. అసలు హంతకులను గుర్తించేందుకు పోలీసు అధికారులు బిజీగా ఉన్నారు.
ఆదివారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నేర స్థలికి పోలీసులు చేరుకున్నారు. ఆ ఇంట్లో చోరీ జరిగినట్టు గుర్తించారు. డెకాయిట్, మర్డర్ కేసు కావటంతో ఉన్నతాధికారులు కదిలారు. ఇక నాగప్పకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు తాడిపత్రిలో ఉంటున్నాడు. మరో కుమారుడు రెండవ భట్టీ నిర్వహిస్తున్నాడు. ఇక పెద్దక్క కుటుంబం వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దొంగలు దాడి చేస్తే.. ఈ రెండు మృతదేహాలు చెల్లాచెదురవుతాయి. కానీ ఒకే మంచంపై నిద్రిస్తున్నట్టు కనిపించటంతో.. ఇది దొంగల పని కాదు.. అని పోలీసులు అనుమానిస్తున్నారు. చంపేసి మళ్లీ వీళ్లద్దరినీ ఒకే చోట పడుకొబెట్టారనే అనుమానంతో డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. ప్రస్తుతం జమ్మలమడుగులో ఈ వృద్ధ జంట హత్యే చర్చనీయాంగా మారింది. అయితే వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. హత్యకు గురైన నాగన్న పెద్దక్కల మధ్య ఉన్న సంబంధం కారణాంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Follow Us