KTR: ఇది కచ్చితంగా అభద్రతా భావమే..బన్నీ అరెస్ట్‌పై కేటీఆర్

అల్లు అర్జన్ రెస్ట్ పై బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. జాతీయ అవార్డు పొందిన ఒక నటుడిని అరెస్టు చేసిన తీరు పాలకుల అభద్రతా భావానికి నిదర్శనం. దీనిని తాము ఖండిస్తున్నామని కేటీఆర్ అన్నారు. 

New Update
KTR

సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిలాటలో చనిపయిన వారికి నా సానుభూతి ఎప్పుడూ ఉంటుంది. కానీ  ఈ ఘటనలో విఫలమైంది ఎవరు? అల్లు అర్జున్‌, ఒక జాతీయ నటుడిని సాధారణ నేరస్థుడిలా చూడటం సరికాదు. తొక్కిసలాట ఘటనకు ఆయన నేరుగా బాధ్యుడు కాదు. బన్ని అరెస్టు తీరును ఖండిస్తున్నా అంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. అల్లు అర్జున్‌ ను ఏ లాజిక్ అయిఏ అరెస్ట్ చేశారో అదే లాజిక్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని కేటీఆర్ అన్నారు. హైడ్రా వల్ల ఇద్దరి మరణానికి రేవంత్‌ కారణమయ్యారు. అభద్రతాభావం కలిగిన నాయకుడు తన చుట్టూ ఉన్న ప్రజలకు ఎల్లప్పుడూ వెన్నుపోటు పొడుస్తూనే ఉంటాడు అని అన్నారు. 

Also Read: Rahul Gandhi:సావర్కార్‌‌పై వ్యాఖ్యలు..రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు

Advertisment
తాజా కథనాలు