AP Rains: నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం.. తీవ్ర తుపానుగా మారనుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న ఈ తీవ్ర వాయుగుండం బుధవారం రాత్రి తుపానుగా బలపడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఆ తర్వాత శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశాలున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ప్రకటించారు.
Also Read: కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ.. టీఎంసీ సంచలన నిర్ణయం !
దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రాయలసీమలోనూ అక్కడకక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు ప్రకటించారు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. శనివారం వరకూ మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: పది నిమిషాలకో మహిళ లేదా బాలికను చంపేస్తున్నారు–యూఎన్ విమెన్ నివేదిక
నాలుగు రోజుల పాటు..
ఈ క్రమంలోనే రానున్న నాలుగు రోజుల పాటు ఏపీలో వాతావరణం ఎలాఉంటుందనే విషయాన్నిఅధికారులు వివరించారు. తీవ్ర వాయుగుండం, తుపాను ప్రభావంతో గురువారం నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి,శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కాకినాడ, గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశాలు కనపడుతున్నాయి. అనకాపల్లి, బాపట్ల, ప్రకాశం, అల్లూరి, విశాఖపట్నం, గుంటూరు, జిల్లాలలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read: పర్మిషన్లు లేకుండా నల్లా కనెక్షన్లు తీసుకునే వారికి షాక్..
చిత్తూరు, వైఎస్ఆర్, తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం, జిల్లాలలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, కృష్ణా, గుంటూరు, అనకాపల్లి, కోనసీమ, విజయనగరం, ఉభయగోదావరి జిల్లాలు, ఏలూరు, బాపట్ల జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
Also Read: AP: ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరు ఈగల్:హోం మంత్రి అనిత
శనివారం శ్రీసత్యసాయి, అన్నమయ్య, వైఎస్ఆర్, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే విజయనగరం, కృష్ణా, ఏలూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురం, నంద్యాల, సత్యసాయి,పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, శ్రీకాకుళం, , గోదావరి జిల్లాలు, గుంటూరు, జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక ఆదివారం వైఎస్ఆర్, తిరుపతి, చిత్తూరు శ్రీకాకుళం, కాకినాడ, ప్రకాశం, కోనసీమ, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్మమయ్య, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వివరించారు. మిగతా చోట్ల తేలికపాటి వర్షం కురవొచ్చని అధికారులు భావిస్తున్నారు.