AP: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కదిరి నుంచి బయల్దేరిన పల్లె వెలుడు ఆర్టీసీ బస్సు వైఎస్సాఆర్ జిల్లా పులి వెందుల సమీపంలో 30 అడుగుల లోయలో పడిపోయింది.
Also Read: కళ్లు చెదిరే డ్రోన్ షో.. 5 గిన్నిస్ రికార్డులు సొంతం
ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలు కాగా వారిలో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని పులివెందుల ప్రభుత్వాసుప్తరికి తరలించారు. ఘటన కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: హ్యాపీ బర్త్‌డే డార్లింగ్.. నెట్టింట దుమ్ము లేపుతున్న ప్రభాస్ ఫ్యాన్స్
Also Read: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. సంచలన ప్రకటన చేసే ఛాన్స్!
Also Read: ఏపీలో టీడీపీ నేత దారుణ హత్య
అన్నమయ్య జిల్లాలో ..బస్సు ఢీకొని ఐదుగురు మృతి
అన్నమయ్య జిల్లాలో విషాదం.. బస్సు ఢీకొని ఐదుగురు మృతి ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బంధువు అంత్యక్రియలకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తున్నవారిని ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బంధువు అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన జరిగిందని చెబుతున్నారు. చిత్తూరు-కడప రహదారిపై కలకడ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. సంబేపల్లె మండలం రౌతుకుంటలో ఓ మహిళ మృతిచెందింది.
అంత్యక్రియల్లో పాల్గొనడానికి కలికిరి మండలం చండ్రావారిపల్లె పంచాయతీ దూదేకులపల్లెకి చెందిన బంధువులు ఆటోలో వెళ్లారు. తిరిగి గ్రామానికి వస్తుండగా ఇందిరమ్మ కాలనీ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఫకీర్‌బీ (55), బుజ్జమ్మ (50), ఖాదర్‌వలీ (35), చిత్తూరు జిల్లా సోమల మండలం నెల్లిమందకు చెందిన ఆటో డ్రైవర్ నూరుల్లా మృతి చెందారు.
మరో వ్యక్తితో పాటు తల్లి, కుమార్తెలు తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతున్నారు. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.