BIG BREAKING: వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డితో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి భేటీ.. అసలేం జరుగుతోంది?

వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కలవడం సంచలనంగా మారింది. అయితే.. ఈ వీడియో ఇప్పటిదా? లేక పాతదా? అన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.

New Update
Kolikapudi Peddireddy

వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కలవడం సంచలనంగా మారింది. రాజమండ్రి జైలులో ఉన్న కొడుకు మిథున్ రెడ్డిని కలిసేందుకు పెద్దిరెడ్డి ఈ రోజు వచ్చారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ లో ఆయనను టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి కలిసినట్లు ప్రచారం సాగుతోంది. పక్కకు వెళ్లి మరీ వారు కాసేపు ముచ్చటించినట్లుగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల సొంత పార్టీ నేతలు, ప్రభుత్వంపై కొలికపూడి తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వీడియో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే. ఈ వీడియో పాతదా? లేక ఈ రోజుదేనా? అన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. 

పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు..

ఇదిలా ఉంటే.. ఈ రోజు కూడా కొలికిపూడి శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరువూరులో పోలీసులే గంజాయిని అమ్మిస్తున్నారంటూ ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. గంజాయి అమ్మకాలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఇది సరైన విధానం కాదని ఫైర్ అయ్యారు. ఇద్దరు టీడీపీ కార్యకర్తల మధ్య నిన్న జరిగిన చిన్న కొట్లాట జరగడంతో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు రాత్రి 9 తర్వాత కూడా విడుదల చేయకపోవడంతో విషయం తెలుసుకున్న కొలికపూడి స్టేషన్ కు వెళ్లి పోలీసులపై ఫైర్ అయ్యారు. 

Advertisment
తాజా కథనాలు