AP Minister Peddireddy Ramachandra Reddy: సీఎం జగన్ పర్యావరణంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు: మంత్రి పెద్దిరెడ్డి
వైపీపీ ప్రభుత్వం వచ్చాక కాలుష్య కారక వ్యర్థాల నియంత్రణలో చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శనివారం తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి పొల్యుషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఆఫీస్ & ల్యాబరేటరిని ప్రారంభించారు. ఈ భవనానికి డాక్టర్ వైఎస్సార్ పర్యావరణ భవనంగా నామకరణం చేశారు. రూ.16.50 కోట్లతో ఈ నూతన భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ పర్యావరణంపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మార్పులు తెచ్చారన్నారు. కొత్త పరిశ్రమలను పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారని కొనియాడారు. తిరుపతిలో సొంత భవనాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.