BIG BREAKING: వైఎస్ జగన్ పై కేసు

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి గుంటూరు మిర్చీ యార్డులో పర్యటించిన వైఎస్ జగన్ పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. యార్డులోకి వెళ్లకూడదని ముందే చెప్పినా జగన్ పట్టించుకోలేదని పోలీసులు చెబుతున్నారు.

New Update
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేసేందుకు ఏపీ పోలీసులు రెడీ అవుతున్నారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినందుకు గాను జగన్ పై కేసు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు గుంటూరులో జగన్ పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. జగన్ పర్యటనకు అధికారులు అనుమతి నిరాకరించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మార్కెట్ యార్డు ఆవరణలో ఎటువంటి రాజకీయ సమావేశాలు, కార్యక్రమాలకు అనుమతి లేదని జగన్ కు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి:AP Liquor Scam: మొత్తం రూ.16 వేల కోట్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేలా.. RTV చేతిలో సంచలన నిజాలు!

అయితే.. జగన్, వైసీపీ నాయకులు మిర్చీ వార్డుకు నేరుగా రావడంపై పోలీసులు సీరియస్ అవుతున్నారు. జగన్ వచ్చే సమయంలో కూడా యార్డులో ఎటువంటి రాజకీయ సమావేశాలకు అనుమతి లేదని మైకులో ప్రచారం చేశామని వారు చెబుతున్నారు. అయినా.. జగన్ పట్టించుకోకుండా నేరుగా యార్డుకు రావడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన అవుతుందని పోలీసులు ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది. 
ఇది కూడా చదవండి:YS Jagan: వంశీ చాలా అందగాడు.. అందుకే చంద్రబాబుకు కోపం: జగన్!

రైతులను దళారులకు అమ్మేశారు..

ఈ రోజు గుంటూరు మిర్చియార్డును మాజీ సీఎం జగన్ సందర్శించారు. మిర్చియార్డు సచివాలయానికి కూతవేటు దూరంలోనే ఉందన్నారు. అయినా మిర్చి రైతుల అవస్థలు, కష్టాలు సీఎం చంద్రబాబుకు పట్టడం లేదని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో మిర్చిరైతుకు క్వింటా 21 వేలు ధర పలికిందన్నారు. నేడు కేవలం 10, 11 వేలకు కూడా కొనే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. పంట అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతు బతకడానికే కష్టపడుతున్నాడన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా గిట్టుబాటు ధర లేదన్నారు. చంద్రబాబు రైతులను దళారీలకు అమ్మేశాడని ఆరోపించారు జగన్.

Advertisment
Advertisment
తాజా కథనాలు