M Vishnu: టాలీవుడ్ నటుడు మంచు విష్ణు సంచలన పోస్ట్ పెట్టారు. 'జీవితంలో ప్రతి క్షణం మీ పక్కనే ఉన్న ప్రియమైన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ కలలను విశ్వసించడం ఎంత ముఖ్యమో కుటుంబం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ సానుకూలత, ప్రేమ మాత్రమే ఉంటుంది. హర్ హర్ మహాదేవ్! జై శ్రీ రామ్!' అంటూ పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుండగా భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. Hard lessons were learnt, hopes are carried forward. Family is everything, and believing in your dreams is just as important. Never forget the loved ones who stand beside you through every moment of life.Here"s to only positivity and love. Har Har Mahadev! Jai Sri Ram! pic.twitter.com/OEVbAkPHSI — Vishnu Manchu (@iVishnuManchu) January 1, 2025 కుటంబ గొడవల నేపథ్యంలో.. ఇటీవల మంచి ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా తమ్ముడు మనోజ్ ను ఉద్దేశిస్తూ విష్ణు ఈ పోస్ట్ పెట్టారని నెటిజన్లు అంటున్నారు. మనోజ్ ఎదుగుదలలో తనతోపాటు కుటుంబం పాత్ర ఉందని, అలాంటిది అవన్నీ మరిచిపోయి ఇప్పుడు సొంత ఫ్యామిలీపై దాడి చేసేందుకు ప్రయత్నించడం దారుణమనే యాంగిల్ లో ఈ కామెంట్స్ చేశారని భావిస్తున్నారు. ఇంత జరిగినప్పటికీ మనోజ్ పై తమకు ప్రేమ మాత్రమే ఉంటుందని విష్ణు పరోక్షంగా చెప్పుకొచ్చారంటున్నారు. అడవి పందుల వివాదం.. ఇదిలా ఉంటే.. ఇదిలా ఉంటే.. మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. మొన్న మంచు మనోజ్ తండ్రితో గొడవకు దిగి రచ్చ రచ్చ చేశాడు. ఆ వివాదం ఇప్పుడిప్పుడే ముగుస్తుందనుకుంటే అంతలోనే మంచు విష్ణు ఇంకో వివాదానికి తెర లేపాడు. తాజాగా ఆయన సిబ్బంది జల్‌పల్లిలోని అటవీ ప్రాంతంలో అడవి పందులను వేటాడినట్లు తెలుస్తోంది. విష్ణు సిబ్బందిలోని మేనేజర్ కిరణ్ చిట్ట అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడాడు. వేటాడిన అడవి పందిని ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్ బంధించి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఇలా అడవి పందులను బంధించి వేటాడటం తప్పు అని మంచు మనోజ్ పలుమార్లు అభ్యంతరం చెప్పినా కూడా విష్ణు సిబ్బంది వినలేదు. అయితే అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.