AP Government : గర్భిణులకు ఏపీ సర్కారు న్యూఇయర్ గిఫ్ట్...ఇక ఆ ఇబ్బంది నుంచి విముక్తి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా గర్భిణులకు ఇది ఎంతగానో ఉపకరించే విషయం. రాష్ట్రంలోని గర్భిణుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొత్తగా ఏడు ఆస్పత్రులలో టిఫా స్కానింగ్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

author-image
By Madhukar Vydhyula
New Update
Pregnant woman

Tiffa Scan machines in Seven Hospitals

AP Government : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా గర్భిణులకు ఇది ఎంతగానో ఉపకరించే విషయం. రాష్ట్రంలోని గర్భిణుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొత్తగా ఏడు ఆస్పత్రులలో టిఫా స్కానింగ్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం ఒక్కో యంత్రానికి సుమారుగా 30 లక్షలు ఖర్చు పెట్టనున్నారు.. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. జనవరి నుంచి ఈ టిఫా స్కానింగ్ సౌకర్యం ఆయా ఆస్పత్రులలో అందుబాటులోకి తెస్తామని సత్యకుమార్ యాదవ్ తేల్చి చెప్పారు.
 
 రాష్ట్రంలోని ఏడు సెకండరీ ఆస్పత్రుల్లో కొత్తగా టిఫా స్కానింగ్‌ సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు  ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఒక్కో టిఫా స్కానింగ్‌ మెషీన్ కోసం రూ.30.48 లక్షలు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. అనకాపల్లి, పార్వతీపురం, నర్సీపట్నం, నందిగామ, తుని, ఒంగోలు, తెనాలి ఆస్పత్రులలో కొత్తగా టిఫా స్కానింగ్‌ యంత్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఆస్పత్రులలో జనవరి నుంచి గర్భిణిలకు టిఫా స్కానింగ్ సౌకర్యం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి వెల్లడించారు. 

టిఫా స్కాన్  ద్వారా గర్భస్థ శిశువుల్లో లోపాలను గుర్తించడానికి అవకాశం ఉంటుంది. గర్భిణులకు 18 నుంచి 22 వారాల మధ్య ఈ టిఫా స్కాన్ చేస్తారు. గర్భస్థ శిశువులో గుండె, మెదడు, మూత్రపిండాలు, వెన్నెముక వంటివి సరైన రీతిలో అభివృద్ధి చెందుతున్నాయో, లేదోననే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ స్కాన్ ఉపకరిస్తుంది. అలాగే గర్భస్థ శిశువులలో ఏవైనా లోపాలు ఉన్నా గుర్తించడానికి స్కాన్ తో వీలవుతుంది. పుట్టబోయే బిడ్డ ఎదుగుదలను గుర్తించటంతో పాటుగా ఆరోగ్యంగా, లోపాలు లేకుండా పిండం పెరుగుతోందని నిర్ధారించుకోవడం కోసం ఈ స్కానింగ్ చేస్తారు. అలాగే ఏదైనా సమస్య ఉంటే, దానికి ముందుగానే చికిత్స అందించేందుకు టిఫా స్కాన్ ఉపకరిస్తుంది.
 
కాగా గత కొన్ని ప్రభుత్వాల కాలంలో ఆస్పత్రులలో టిఫా స్కానింగ్ సౌకర్యం అందుబాటులో లేకపోవటంతో గర్భిణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ స్కానింగ్ కోసం ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. వారు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనివల్ల ఆర్థికంగానూ ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులలో అన్ని మౌలిక వసతులు కల్పించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. గర్భిణుల కోసం టిఫా స్కానింగ్ మెషీన్లను కూడా సమకూర్చాలని నిర్ణయం తీసుకుంది.అందులో భాగంగా రాష్ట్రంలోని ఏడు ఆస్పత్రులలో ఈ టిఫా స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకురానుంది. జనవరి నుంచి వీటిని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు