MRO : రమణయ్య కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం.. ఒకరికి ఉద్యోగం
దారుణ హత్యకు గురైన ఎమ్మార్వో రమణయ్య కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. రమణయ్య ఫ్యామిలీకి రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.
దారుణ హత్యకు గురైన ఎమ్మార్వో రమణయ్య కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. రమణయ్య ఫ్యామిలీకి రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.
విజయవాడ రీజనల్ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీహెచ్ శ్రీదేవిని ప్రభుత్వం తాజాగా బదిలీ చేసింది. ఆమె స్థానంలో శివరామ ప్రసాద్ ను నియమించింది. భారీగా డబ్బులు చేతులు మారడంతోనే బీసీ మహిళా అధికారి అయిన శ్రీదేవికి అన్యాయం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పదోతరగతి పబ్లిక్ పరీక్షల గురించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కంపోజిట్ తెలుగు, కాంపోజిట్ సంస్క్రుతం పేపర్లను కొనసాగించాలని నిర్ణయించింది. మొదట్లో ఈ పేపర్లను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అయితే విద్యా సంవత్సరం మధ్యలో మార్పులు చేయడంపై విమర్శలు తలెత్తడంతో సర్కార్ వెనకడుగు వేసింది. వచ్చే ఏడాది నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంది.
ఏపీ కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ అసెంబ్లీలో నేడు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించే బిల్లుకు ఆమోదముద్ర వేసింది. అనంతరం జీపీఎస్ బిల్లును ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ సర్కార్ తీపికబురందించింది. ఏపీలో జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. యూపీఎస్సీ, ప్రిలిమ్స్, మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఆర్థికసాయం అందించేందుకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.