CID: ఆ కేసు సీఐడీకి.. వైసీపీకి చంద్రబాబు సర్కార్ మరో షాక్!

మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌ పై దాడి కేసును సీఐడీకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసును కూడా ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.

New Update
AP : నేడు ఏపీ కొత్త టెట్‌ నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే!

Ap Govt: ఏపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు కేసులను ఏపీ సీఐడీకి అప్పగిస్తూ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌ పై దాడి కేసును సీఐడీకి అప్పగిస్తూ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. టీడీపీ కార్యాలయం పై గత ప్రభుత్వ హయాంలో దాడులు జరిగిన సంగతిత తెలిసిందే.

Also Read: ఆదివాసి హత్యలు, ఎలక్టోరల్ బాండ్లు.. టాటాపై ఉన్నవివాదాల్లో నిజమెంత?

ఆ దాడుల సమయంలో కొన్ని వాహనాలతో పాటు ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేశారు. ఈ కేసును మంగళగిరి పోలీసుల నుంచి సీఐడీకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అరెస్టయ్యారు. చంద్రబాబు నివాసంపై... మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసును కూడా ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. 

Also Read: మరోసారి విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌..19 మంది పాలస్తీనియన్లు మృతి!

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ నేత జోగి రమేష్ తన అనుచరులతో కలసి ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంపై దాడికి యత్నించారని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఆ కేసులో మంగళగిరి పోలీసుల ఎదుటకు జోగి రమేష్ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ కేసును కూడా సీఐడీకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

Also Read: ఏపీలో టెన్షన్ టెన్షన్.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు