AP Budget: నేడే ఏపీ బడ్జెట్‌.. రూ.3.24 లక్షల కోట్లతో సిద్ధం!

ఏపీ కూటమి ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ రూపుదిద్దుకుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ 2025-26 ఆర్థిక సంవత్సరం ‘పేపర్‌లెస్‌’ బడ్జెట్‌ను నేడు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. రూ.3.24 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. 

New Update
ap budget

AP Assembly Budget 2025

AP Budget:  ఏపీ కూటమి ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ రూపుదిద్దుకుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ 2025-26 ఆర్థిక సంవత్సరం ‘పేపర్‌లెస్‌’ బడ్జెట్‌ను నేడు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. రూ.3.24 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పేపర్ లెస్ బడ్జెట్ మంత్రి పయ్యావుల 10 గంటలకు అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుండగా ముందుగా విజయవాడలోని తన ఇంటి వద్ద అధికారులతో కలసి బడ్జెట్ ప్రతులకు శాస్త్రోకంగా పూజలు నిర్వహించారు.

సీఎం చంద్రబాబుకు బడ్జెట్ ప్రతులు..

బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి బయలుదేరిన మంత్రి పయ్యావుల మొదటగా సీఎం చంద్రబాబుకు బడ్జెట్ ప్రతులను అందచేయనున్నారు. ఆ తర్వాత ఉదయం 9 గంటలకు జరిగే మంత్రివర్గ భేటీలో బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు. 10 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ బడ్జెట్‌ ప్రసంగం మొదలవుతుంది. మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం  వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెడతారు. 

ఇది కూడా చూడండి: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

ఇక నవంబరులో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.2.94 లక్షల కోట్ల ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌తో పోల్చితే 10 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్‌లో కేటాయింపులు చేయగా.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు భారీగా నిధులు కేటాయించనున్నారని తెలుస్తోంది. కేంద్ర సహకారంతో ‘సూపర్‌ సిక్స్‌’ హామీలను అమలు చేసేలా పద్దులు రూపొందించారట. వచ్చే ఏడాది జూన్‌ 12వ తేదీ నాటికి 5 లక్షల ఇళ్లను పేదలకు అందించాలనే లక్ష్యంతో నిధులు కేటాయించారట. అమరావతి, పోలవరంతోపాటు వెలిగొండ, వంశధార, హంద్రీనీవా ప్రాజెక్టులకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 


ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!

వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.50 వేల కోట్లు కేటాయించే అవకాశం ఉంది. అన్నదాత- సుఖీభవ, పంటల బీమా, వడ్డీ లేని - పావలా వడ్డీ రుణాలు, వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మసేద్యం, ప్రకృతి వ్యవసాయం, ఆయిల్‌పామ్‌, రాయితీ విత్తనాలు, ఎన్టీఆర్‌ జలసిరి, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు భృతి, వ్యవసాయ సాంకేతిక పథకాలకు బడ్జెట్ కేటాయించనున్నారు.  అయితే ఈసారి పేపర్ సంప్రదాయానికి స్వస్తి పలికి పూర్తిస్థాయి ‘ఈ-బడ్జెట్‌’ను ప్రవేశపెట్టనున్నారు. ‘ట్యాబ్‌’లలోనే బడ్జెట్‌ను లోడ్‌ చేసి ఇవ్వనున్నారు. 

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు