AP Ministers : మొత్తం 26 జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. పవన్ కళ్యాణ్, లోకేష్ లకు ఇన్‌ఛార్జి బాధ్యతలు ఇవ్వకపోడంతో నలుగురు మంత్రులకు రెండేసి జిల్లాల బాధ్యతలను అప్పగించింది. జనసేన మంత్రులకు ఏలూరు, గుంటూరు జిల్లాల బాధ్యతలు ఇచ్చింది. బీజేపీ మంత్రికి ఎన్టీఆర్ జిల్లా బాధ్యతల అప్పగించింది.
శ్రీ కా కు ళం జి ల్లా కు ఇన్‌ఛార్జి మంత్రిగా కొం డ ప ల్లి శ్రీనివాస్, పార్వతీపురం మన్యం జిల్లా ఇన్‌ఛార్జిగా మంత్రి అచ్చెన్నాయుడు, విజయనగరం జిల్లా ఇన్‌ఛార్జిగా మంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా డోలా బాలవీరాంజనేయస్వామి, అనకాపల్లి జిల్లా ఇన్‌ఛార్జిగా మంత్రి కొల్లు రవీంద్రను నియమించింది. కాగా ఇన్‌ఛార్జి మంత్రులు వారి సంబంధిత జిల్లాలలో పలు ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలును సమీక్షించి, పర్యవేక్షించాలని ఆదేశాలు ఇచ్చింది.
ఇది కూడా చదవండి: మహా ఎన్నికలకు మోగనున్న నగారా!
ఇన్‌ఛార్జి మంత్రుల వివరాలు...
* విశాఖపట్నం - డోలా బాలవీరాంజనేయస్వామి
* అల్లూరి సీ తా రామరాజు- గుమ్మిడి సంధ్యారాణి
* అ న కా ప ల్లి- కొ ల్లు ర వీం ద్ర
* కాకినాడ- పొంగూరు నారాయణ
* తూర్పుగోదావరి- నిమ్మల రామానాయుడు
* ఏలూరు- నాదెండ్ల మనోహర్
ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్
* పశ్చిమగోదావరి, పల్నాడు- గొట్టిపాటి రవికుమార్
* ఎన్టీఆర్- సత్యకుమార్ యాదవ్
* కృష్ణా- వాసంశెట్టి సుభాష్
* గుంటూరు- కందుల దుర్గేష్
* బాపట్ల- కొలుసు పార్థసారథి
* ప్రకాశం- ఆనం రామనారాయణరెడ్డి
ఇది కూడా చదవండి: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి... ఆరోజే కీలక ప్రకటన!
- నె ల్లూ రు- ఎన్‌ఎండీ ఫరూక్
* నంద్యాల- పయ్యావుల కేశవ్
* అ నం త పు రం- టీజీ భరత్
* శ్రీసత్యసాయి, తిరుపతి- అనగాని సత్యప్రసాద్
* వైఎస్‌ఆర్- ఎస్.సవిత
* అన్నమయ్య- బీసీ జనార్దన్‌రెడ్డి
* చిత్తూరు- మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి