ఫ్రీ గ్యాస్ స్కీంకు అప్లై చేసుకునేవారికి అలర్ట్.. లాస్ట్ డేట్ ఆరోజే!

ఏపీలో ఉచిత గ్యాస్ స్కీంకు ఈ నెల 31వ తేదీలోగా మొదటి సిలిండర్‌ను బుక్ చేసుకోవాలి. లేకపోతే ఏడాదికి ఫ్రీగా వచ్చే మూడు సిలిండర్‌లో ఒకటి కోల్పోయినట్లే అని కమిషనర్ సౌరభ్ గౌర్ తెలిపారు. ఈ పథకం విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే 1967కు కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు.

New Update
free gas cylinder scheme

Free gas Cylinder

ఏపీలో ఉచిత గ్యాస్ స్కీంకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ నెల 31వ తేదీలోగా మొదటి సిలిండర్‌ను బుక్ చేసుకోవాలి. లేకపోతే ఏడాదికి మూడు ఫ్రీగా వచ్చే సిలిండర్‌లో మీరు ఒకటి కోల్పోతారు. మొదటి సిలిండర్‌కు బుక్ చేసుకోని వారు వెంటనే అప్లై చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ తెలిపారు. ఎందుకంటే ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్‌లు స్టార్ట్ అవుతాయి. 

ఇది కూడా చూడండి: Delhi Railway station :  ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన  ఢిల్లీ రైల్వే స్టేషన్‌!

హామీల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్..

సూపర్-6 హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తోంది. దీపం 2 పథకం కింద ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకున్నారు. వీరిలో 94 లక్షల మందికి బ్యాంకు ఖాతాల్లో 48 గంటల్లోనే సబ్సిడీ డబ్బులు జమ అయ్యాయి. ఇంకా 14 వేల మందికి సబ్సిడీ చెల్లింపులు కాలేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ వెల్లడించారు.

ఇది కూడా చూడండి:USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి

కూటమి ప్రభుత్వం మొత్తం మూడు ఉచిత సిలిండర్లను అందజేస్తుంది. మొదటిది సిలిండర్‌ను మార్చి 31వ తేదీ, రెండో సిలిండర్‌ను జూలై 31 లోపు, మూడో సిలిండర్‌ను నవంబరు 30లోగా ఎప్పుడైనా కూడా పొందవచ్చు. ఇలా ఏడాదిలో మూడు విడతలగా గ్యాస్ సిలిండర్‌ను అందిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న 24 లేదా 48 గంట్లల్లో డెలివరీ చేస్తారు. అయితే ఈ పథకంలో ఏమైనా సందేహాలు ఉంటే 1967కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. 

ఇది కూడా చూడండి:Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్

Advertisment
తాజా కథనాలు