డిప్యూటీ సీఎం పవన్ పేషీలోకి మరో యువ లేడీ ఐఏఎస్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం, తెలంగాణలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన ఐఏఎస్ ఆమ్రపాలి పవన్ పేషీలోకి రానున్నట్లు సమాచారం. ఆమెకు కీలక బాధ్యతలు అప్పజెప్పేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పనిచేస్తున్న ఏడుగురు ఐఏఎస్‌లను ఇటీవల కేంద్రం ఏపీ కేడర్‌కు కేటాయించింది.
Also Read : బీఫ్‌ను ఎగబడి తింటున్నారు...షాకింగ్ సర్వే
అక్టోబర్ 16వ తేదీ లోపు వారంతా రాష్ట్రంలో రిపోర్టు చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ) ఆదేశాలు జారీ చేసింది. అయితే డీఓపీటీ ఆదేశాలపై ఆమ్రపాలితో సహా నలుగురు ఐఏఎస్‌లు క్యాట్‌ను ఆశ్రయించారు. తాము తెలంగాణలోనే ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే డీఓపీటీ ఆదేశాలను పాటించాల్సిందేనని క్యాట్ తేల్చిచెప్పింది.
16వ తేదీలోపు ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. క్యాట్ తీర్పుపై మళ్లీ హైకోర్టు ఆశ్రయించారు ఐఏఎస్‌లు. హైకోర్టు కూడా వారికి చీవాట్లు పెట్టింది. అధికారులంటే ప్రజా సేవకులని.. ప్రభుత్వం ఎక్కడ కేటాయిస్తే అక్కడకు వెళ్లాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆ ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌లను రిలీవ్ చేసి వారి స్థానంలో వేరే వారిని నియమించింది. వీరంతా ఏపీలో రిపోర్టు చేయనున్నారు.
Also Read : నేడు ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
పవన్ పేషీలోకి ఆమ్రపాలి..
డిప్యూటీ సీఎంతో పాటు, తన శాఖల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పవన్ కల్యాణ్ నిత్యం కష్టపడుతూనే ఉన్నారు. ప్రజలకు మంచి చేయటమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ప్రతి అంశంపై అధికారులతో సమీక్షలు చేస్తూ వారికి ఆదేశాలు ఇస్తున్నారు. అయితే ఉత్సాహవంతులైన అధికారులను తన పేషీలో నియమించుకునేందుకు పవన్ ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read : అశోక్‌నర్‌లో హై టెన్షన్..రోడ్డెక్కిన గ్రూప్ 1 అభ్యర్థులు
యువ ఐఏఎస్‌లు చురుగ్గా పనిచేస్తారని ఆయన భావన. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీకి చెందిన ఓ ఐఏఎస్‌ను కేరళ నుంచి మరీ తన పేషీకి రప్పించుకున్నారు. అలాగే ఆమ్రపాలిని కూడా డిప్యూటీ సీఎం పవన్ పేషీకి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు ఆమ్రపాలి చాలా చురుగ్గా వ్యవహరించారు. హైదరాబాద్ నగర పరిశుభ్రత కోసం పలు చర్యలు చేపట్టారు.
నిత్యం పర్యటనలు చేస్తూ అధికారులను అప్రమత్తం చేసేవారు. దీనితో పాటు ప్రధాని కార్యాలయంలో పనిచేసిన అనుభవం కూడా ఆమెకు కలిసి రానుంది. ఈ నేపథ్యంలో ఆమ్రపాలిని పవన్ శాఖలకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
Also Read : నేడు హర్యానాకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్