ఏపీ మాజీ సీఎం జగన్ కు సంబంధించిన సరస్వతి పవర్ పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ రోజు పల్నాడు జిల్లాలోని మాచవరం మండలం వేమవరం, చెన్నాయపాలెంలో సరస్వతి పవర్ భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాజమాన్యం 1384 ఎకరాల భూముని కొన్నట్లు చెప్పారు. అందులో 24 ఎకరాల అసైన్డ్ భూమి ఉందన్నారు. బాంబులేసి భయపెట్టి రైతుల నుంచి భూములు తీసుకున్నారని ఆరోపించారు. ఇలాగే వదిలేస్తే పేట్రేగి పోతారన్నారు. రైతులకు అండగా ఉండటానికి తాను ఇక్కడికి వచ్చానన్నారు. ఇక్కడికి ఫ్యాక్టరీ రాలేదు కానీ.. అన్నాచెల్లెళ్లు కొట్టుకున్నారన్నారు. అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చి తీసేసుకున్నారన్నారు. మరి ఫ్యాక్టరీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Lady Aghori: అఘోరీపై ఏపీ డీజీపీకి లేఖ.. ఈ ట్విస్ట్ ఎవరూ ఊహించలేరు!
యాభై ఏళ్లకు ఒకేసారి లీజు..
జగన్ సీఎంగా ఉన్నప్పుడు యాభై ఏళ్ళకు లీజు తీసుకున్నారన్నారు. ఉపాధి అవకాశాలు ఇస్తే సంతోషమన్నారు. సహజ వనరులు ఒకరి సొంతం కాదన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతిలివ్వరని క్యాప్టివ్ పవర్ గా అనుమతి తీసుకున్నారన్నారు. పొల్యూషన్ బోర్డు అనుమతి తీసుకోలేదన్నారు. 700 ఎకరాల భూమి మాచవరం, దాచేపల్లి మండలాల్లో స్వంత ఫ్యాక్టరీ కోసం తీసుకున్నారన్నారు. రైతులకు, వారి పిల్లలకు ఉద్యోలిస్తామని భూములు తీసుకున్నారన్నారు. ఇది రాష్ట్ర సమస్య అని అన్నారు. గతంలో పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు వేసి భయపెట్టారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Minister Narayana : చంద్రబాబు Vs పవన్.. క్లారిటీ ఇచ్చిన మంత్రి
సరస్వతి కంపెనీకి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగలేదన్నారు. గత ప్రభుత్వం ఇప్పుడున్న యువతను భయపెట్టిందన్నారు. పోలీసులు భయపడ్డారు.. లేదంటే మెత్తబడ్డారన్నారు. రౌడీయిజాన్ని అరికట్టాలన్నారు. కొందరు ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లు భావిస్తున్నారన్నారు. లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉందో చేసి చూపిస్తామన్నారు. 700 ఎకరాలకు సరిపోయేంత నీళ్ళు తీసేసుకున్నారన్నారు. ఈ విషయంపై తాను కేబినెట్లో కూడా చర్చిస్తానన్నారు. ప్రజలపై బాంబుల దాడి చేస్తే చూస్తూ ఊరుకోవద్దని ఎస్పీకి చెబుతున్నానన్నారు.