BIG BREAKING: అన్నకు రాఖీ.. కేటీఆర్ ఇంటికి కవిత?

రాఖీ పండుగ వేళ తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. కేటీఆర్ ఇంటికి కవిత వెళ్లి రాఖీ కడుతుందా? లేదా? అన్న అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. మరికొన్ని గంటల్లో ఈ అంశంపై క్లారిటీ రానుంది.

New Update
Kavitha Rakhee to KTR

నేడు దేశ వ్యాప్తంగా రాఖీ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. తమ సోదరుల సుఖసంతోషాలను కాంక్షిస్తూ మహిళలు వారికి రాఖీలు కడుతున్నారు. అయితే.. రాఖీ పండుగకు పదిహేను రోజలు ముందు నుంచే తెలంగాణ రాజకీయాల్లో ఓ ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ సారి ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన సోదరుడు కేటీఆర్ కు రాఖీ కడుతుందా? లేదా? అన్నది ఆ చర్చ సారాంశం. గత కొన్ని రోజులుగా కవిత బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆ పార్టీలో దెయ్యాలు ఉన్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు కవిత. తన తండ్రి కేసీఆర్ నాయకత్వాన్ని తప్పా.. ఇంకా మరెవరి నాయకత్వాన్ని ఒప్పుకునేది లేదంటూ అనేక సార్లు ఆమె స్పష్టం చేస్తున్నారు. తద్వారా కేటీఆర్ నాయకత్వాన్ని తాను అంగీకరించనని ఆమె తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.

దీంతో ప్రతీ సారి కేటీఆర్ ఇంటికి వెళ్లి రాఖీ కట్టే కవిత ఈ సారి కడుతుందా? లేదా? అన్న ఉత్కంఠ బీఆర్ఎస్ తో పాటు పొలిటికల్ సర్కిల్స్ లో నెలకొంది. అయితే.. తాను కేటీఆర్ కు తప్పకుండా రాఖీ కడతానని కవిత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో కవిత కేటీఆర్ ఇంటికి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ అంశంపై సోషల్ మీడియాలోనూ జోరుగా చర్చ సాగుతోంది. కవిత కేటీఆర్ కు రాఖీ కడుతుందని బీఆర్ఎస్ వర్గాలు పోస్టులు పెడుతున్నాయి.

మరికొందరు మాత్రం కవిత రాఖీ కట్టడం కేటీఆర్ కు ఇష్టం లేదని పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు హైదరాబాద్ లో లేరని వారు అంటున్నారు. దీంతో ఈ సారి కేటీఆర్ కు కవిత రాఖీ కట్టినా.. కట్టకపోయినా.. అది తెలంగాణ పాలిటిక్స్ మాత్రం ఆసక్తికర పరిణామంగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు. కవిత ఈ సారి కూడా అన్న కేటీఆర్ కు రాఖీ కడితే వారి మధ్య సయోధ్య కుదిరే అవకాశం ఉన్నట్లు భావించవచ్చని.. లేకపోతే విభేదాలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితి లేదని అంచనా వేయొచ్చని చెబుతున్నారు. కవిత రాఖీ అంశంపై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది. 

సోషల్ మీడియాలో కవిత పోస్టు..

ఇదిలా ఉంటే.. రాఖీ నేపథ్యంలో కవిత తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధానికి రక్షాబంధన్ ప్రతీక అని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పౌర్ణమి వేడుకను ప్రేమానురాగాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నానన్నారు. కేటీఆర్ కు రాఖీ కడుతున్నావా అక్క? అంటూ అనేక మంది ఈ పోస్టు కింద కామెంట్లు పెడుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు