Turtles Death: కాకినాడ సముద్రతీరంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడటంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరాతీశారు. ఇందుకు గల కారణాలేంటో తెలపాలని అధికారులను విచారణకు ఆదేశించారు. సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. కాకినాడ బీచ్ రోడ్, ఏపీఐఐసీ, వాకలపూడి ప్రాంతాల్లో అరుదైన రిడ్లీ తాబేళ్ల మరణానికి కారణాలు విచారించి, దీనికి కారణం అవుతున్న వారిపై చర్యలు చేపట్టాలన్నారు. వన్యప్రాణుల పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు..
ఈ మేరకు సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రతి సంవత్సరం తూర్పు గోదావరి జిల్లా ప్రాంతానికి వలస వస్తాయి ఈ అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు. కాకినాడ సమీపంలో హోప్ ఐలాండ్ తో పాటు.. కాట్రేనికోన వద్ద గచ్చకాయలపొర, సాక్రిమెంట్ ఈ ప్రాంతాలలో గుడ్లు పెడతాయి. ప్రతి ఏటా జనవరి ఫిబ్రవరి నెలలో గుడ్లు పెట్టేందుకు ఈ అరుదైన తాబేలు వస్తుంటాయి. ప్రతి ఏటా అడవి శాఖ అధికారులు, కొన్ని సేవా సంఘాలు కలిసి వాటిని సంరక్షించి గుడ్లు పెట్టిన తర్వాత తిరిగి మళ్లీ సముద్రంలోకి తాబేళ్లను వదులుతారు. సముద్ర జలాలు శుద్ధి చేయడంలో ఈ తాబేలు ఏంతో కీలక పాత్ర పోషిస్తాయి. సముద్రంలోని నాచు, జెల్లీ పీస్, మృతిచెందిన చేపలను తింటు జలాలు శుద్ధి చేస్తాయి.
ఇది కూడా చదవండి: TG News: రాష్ట్రంలో మరో 200 కొత్త గ్రామ పంచాయతీలు.. ఎన్నికలకు ముందే!?
కుక్కలు, నక్కలు తాబేలుపై దాడి..
అందువల్ల వలస వచ్చే ఈ ఆలీవ్ రిడ్లీ తాబేళ్ల వలన ఎంతో ఉపయోగం. ప్రయాణం చేసే క్రమంలో.. వలల తాళ్లు బిగించుకుని, బోటు రెక్కలు తగిలి కోన్ని మృత్యువాత పడతాయి. గుడ్లు పెట్టే సమయంలో కుక్కలు, నక్కలు తాబేలుపై దాడి చేసి చంపుతాయి. ఈ విధంగా మరణించినవి కొన్ని అయితే.. ఫ్యాక్టరీల వల్ల కలుషితమైన వ్యర్ధాలు సముద్రంలో కలిసి మరికొన్ని మృత్యువాత పడుతుంటాయని అధికారులు చెబుతున్నారు. కాకినాడ తీర ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతున్న పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలని పవన్ ఆదేశించారు. వీటిని సంరక్షించవలసిన బాధ్యత అటవీ శాఖ అధికారులు తీసుకోవాలని, వన్యప్రాణులు సంరక్షించేందుకు ఎటువంటి చర్యలు చేపడుతామో ఆ విధంగా రక్షించాలని నివేదిక ఇవ్వాలని అటడవి శాఖ అధికారులకు స్పష్టం చేశారు.