మూడ్ ఆఫ్ ది నేషన్ : బెస్ట్ సీఎంగా నాలుగో స్థానంలో చంద్రబాబు

ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ లో ఏపీ సీఎ: చంద్రబాబు నాలుగో స్థానంలో నిలిచారు. దేశంలో ఉన్న బెస్ట్ ముఖ్యమంత్రుల్లో ఆయన మొదటవరుసలో ఉన్నారు. గత ఏడాది 5వ స్థానంలో ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఒకమెట్టు పైకెక్కారు.

New Update
Chandra babu Naidu

Chandra babu Naidu

ఇండియా టుడే ప్రతి ఆరు నెలలకు ఓ సారి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేను చేసి అందులో రాజకీయ నాయకులు, పార్టీల పరిస్థితిని అంచనా వేస్తుంటుంది. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి వాటిని సర్వే రూపంలో వెలువరిస్తుంది. తాజాగా ప్రకటించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే రిజల్ట్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాలుగో ప్లేస్ లో ఉన్నారు. గత ఏడాది ఆగస్టులో ఆయన ఐదో స్థానంలో ఉన్నారు. ఈ ఆరు నెలల్లో తన స్థానాన్ని  మెరుగుపర్చుకున్నారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా రాష్ట్రాన్ని గాడిన పెట్టడంతో పాటు పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, ఉచిత సిలిండర్ వంటి పథకాలు అమలు చేయడం చంద్రబాబు మైలేజీని పెంచింది.

Also Read:  ‘నాన్న క్షమించండి.. మీ కలల్ని నెరవేర్చలేకపోయా’: జేఈఈ విద్యార్థిని సూసైడ్‌!

ఇక దేశం మొత్తం మీద బెస్ట్ సీఎంల జాబితాలో యోగి ఆదిత్యానాథ్ మొదటి స్థానంలో ఉన్నారు. కుంభమేళా నిర్వహణ, ఏర్పాట్ల విషయంలో ఆయన ప్రజాదరణ చూరగొన్నారు. రెండవ స్థానంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ తర్వాత మూడో స్థానంలో నిలిచారు. ఇటీవల సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ ఐదో స్థానంలో ఉన్నారు. 

తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టినప్పటికీ డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఇప్పటికీ మంచి ఆధిక్యంతో ఉందని మూడ్ ఆఫ్ ది నేషన్ స్పష్టం చేసింది. విజయ్ ప్రభావాన్ని పెద్దగా తేల్చలేదు. ఈ క్రమంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయి.

Also Read: అయోధ్య ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ అంత్యక్రియలు.. సరయూ నదిలో జల సమాధి

Advertisment
తాజా కథనాలు