ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయింది. గత ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతిని ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ప్రధాని మోదీకి వివరించారు. ఈ రోజు ఢిల్లీ చంద్రబాబు మోదీ భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు వీరిద్దరూ మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో పలు కీలక అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారని సమాచారం. దాంతో పాటూ కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు, మోదీని కోరినట్టు తెలుస్తోంది. దీని తర్వాత ఏపీ సీఎం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు.