AP BREAKING: ఏపీలో మరో కొత్త జిల్లా.. చంద్రబాబు కీలక ప్రకటన!

మార్కాపురంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కాపురాన్ని జిల్లా చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామన్నారు. తప్పకుండా మార్కాపూరంను జిల్లా కేంద్రం చేస్తామని ప్రకటించారు.

New Update

మార్కాపురంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కాపురాన్ని జిల్లా చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామన్నారు. తప్పకుండా మార్కాపూరంను జిల్లా కేంద్రం చేస్తామని స్పష్టం చేశారు. తద్వారా ఈ ప్రాంతంలోని అనేక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. చంద్రబాబు ప్రకటనతో మార్కాపురం ప్రాంత ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది. మార్కాపురంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. చంద్రబాబుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం సందర్శించారు. స్వయంకృషితో ఎదిగిన మహిళలను ముఖ్యమంత్రి అభినందించారు.

Advertisment
తాజా కథనాలు