/rtv/media/media_files/2024/12/29/FfuQlxNMvLIdfi5IMXpX.jpg)
CM Chandrababu Naidu approves 190 new ambulance vehicles in AP
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుపై కేసులు సీబీఐకి బదిలీ చేయాలని దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పిటిషన్ కు సంబంధించి ఒక్క మాట మాట్లాడిన భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది హెచ్చరించారు. ఇది పూర్తి స్థాయిలో తప్పుడు పిటిషన్ అని ధర్మాసనం పేర్కొంది. స్కిల్ డవలప్మెంట్, ఫైబర్ నెట్ తదితర వ్యవహారాల్లో చంద్రబాబుపై గత జగన్ ప్రభుత్వం సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో చంద్రబాబు జైలుకు కూడా వెళ్లారు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. అయితే.. ఈ కేసులు సీబీఐకి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ హైకోర్టు న్యాయవాది బాలయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం..
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పిటిషనర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతటితో ఆగకుండా ఈ పిటిషన్ పై వాదనలు వినిపించడానికి సిద్ధం అవుతున్న సీనియర్ లాయర్ మహేంద్రసింగ్ ను పై సైతం న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులపై మీలాంటి సీనియర్లు వస్తారని ఊహించలేమని వ్యాఖ్యనించింది. అనంతరం పిటిషన్ ను కొట్టేసింది.