CM Chandrababu: పిఠాపురం, మంగళగిరికి సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. కీలక ప్రకటన!

స్వర్ణాంధ్ర విజన్-2047కి సంబంధించి పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ నియోజకవర్గాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్వర్ణాంధ్ర విజన్ - 2047 సాధనలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చ ఎప్పారు.

New Update

స్వర్ణాంధ్ర విజన్ - 2047 సాధనలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం చంద్రబాబునాయుడు వెళ్లడించారు. వాటిని అమలు చేసి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేలు సంకల్పం తీసుకోవాలన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ముందు కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ నియోజకవర్గాలకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసినట్టు చెప్పారు. సోమవారం జరిగిన శాసనసభ సమావేశంలో జరిగిన లఘ చర్చలో ‘స్వర్ణాంధ్ర విజన్-2047’లో భాగంగా రూపొందించిన నియోజకవర్గాల-2047 విజన్ డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించి, ప్రజెంటేషన్ ఇచ్చారు. నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్‌ను సఫలీకృతం చేసుకునేందుకు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. దీనికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. మండల, మున్సిపాలిటీ విజన్ యాక్షన్ ప్లాన్‌ను గ్రామ, వార్డు సచివాలయం యూనిట్‌గా తీసుకుని అమలయ్యేలా చూస్తామన్నారు.

జిల్లా విజన్ డాక్యుమెంట్ రూపొందించి కలెక్టర్ల సదుస్సులో విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రతి చివరి వ్యక్తిని కూడా విజన్‌లో భాగస్వామిని చేస్తామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే ప్రస్తుతం నెలకొన్న సమస్యలు ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలాగా పరిశ్రమలు తరిమేయడం కాకుండా... తీసుకురావడం నేర్చుకోవాలని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పరిశ్రమలు తేవడంలో మీరు కూడా భాగములు అవ్వాలని సూచించారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఉండాలి...అలానే ఉపాధి కలగాలంటే పరిశ్రమలు రావాలి... సేవల రంగం వృద్ధితో ఆదాయం పెరుగుతుందని చెప్పారు. 

ప్రతీ కుటుంబానికి సొంతిల్లు

నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం సెంటు పట్టాను ఊరికి దూరంగా ఇచ్చిందన్నారు. దాంతో అవి ఎవరికీ పనికిరాకుండా, చాలీచాలనట్టుగా ఉండటంతో నిరుపయోగం అయ్యాయన్నారు. 2029 నాటికి ప్రతి కుటుంబానికి సొంతిల్లు నిర్మిస్తామన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు