Chandrababu: ఎన్ని సార్లు చెప్పినా మీరు మారరా? మంత్రులపై చంద్రబాబు ఫైర్!

కొందరు మంత్రులు తమ పనితీరును మెరుగుపరచుకోవాలని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మంచిగా ఉండాలి.. కానీ మరీ మెతకగా ఉండకూడదని చెప్పినట్లు సమాచారం.

New Update
AP CM Chandrababu Ministers

చాలామంది మంత్రులకు ఇంకా సీరియస్‌నెస్‌ రావడం లేదని సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ రోజు కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు ఆయన ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై మంత్రులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో విమర్శలు ఎదుర్కొన్న అధికారుల తీరు ఇప్పటికీ మారలేదని బాబు అన్నట్లు తెలుస్తోంది.

Also Read : అమెరికా ఎన్నికల్లో 'జై బాలయ్య'.. వైరల్ అవుతున్న బ్యాలెట్ పేపర్

అధికారుల కారణంగా విమర్శలు..

అలాంటి అధికారుల తీరు కారణంగానే మనం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని చంద్రబాబు ఫైర్ అయినట్లు సమాచారం. మనం మంచిగా ఉండొచ్చు, కానీ మెతకగా ఉండకూడదని చెప్పినట్లు సమాచారం. మంత్రులు తమ పనితీరును మెరుగుపరచుకోవాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కొంతమంది మంత్రులకు ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Also Read : హైదరాబాద్ లో నకిలీ కారం పొడి దందా.. స్వస్తిక్ బ్రాండ్ పేరుతో విక్రయాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు