హైదరాబాద్ లో నకిలీ కారం పొడి దందా.. స్వస్తిక్ బ్రాండ్ పేరుతో విక్రయాలు స్వస్తిక్ బ్రాండ్ పేరిట నకిలీ కారం విక్రయిస్తున్న దందాను పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మాన్ గంజ్ లో రూపారామ్ ఖత్రీ అనే వ్యక్తి కొన్నాళ్లుగా రసాయనాలు, రంగులు కలిపిన నకిలీ కారాన్ని తయారు చేసి విక్రయిస్తున్నాడు. దీని గురించి తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. By Archana 06 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Swastik chilli powder షేర్ చేయండి Swastik chilli powder: ఈ మధ్య ఎక్కడ చూసిన కల్తీ అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. పాలలో పౌడర్లు కలపడం, మసాలాలో చెక్క పొట్టు, ఎండుమిర్చి తొడిమెలు, ఆకులు వంటివి కలిపి విక్రయించడం చేస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీల పేర్లతో ఇలాంటి నకిలీ వస్తువులను అమ్ముతూ జనాలను మాయ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి తరహా దందాను పోలీసులు చెక్ పెట్టారు. స్వస్తిక్ బ్రాండ్ పేరిట కల్తీ కారం దందా నడుపుతున్న వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. Also Read: అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్.. ఏపీ హైకోర్టులో కేసు కొట్టివేత! నకిలీ కారం విక్రయాలు అయితే రాజస్థాన్ బార్మేర్ జిల్లా లోహారా గ్రామానికి చెందిన రూపారామ్ ఖత్రీ అనే వ్యక్తి కొంతకాలం క్రితం హైదరాబాద్ వచ్చి అప్జల్ గంజ్ లో బట్టలు దుకాణం పెట్టుకున్నాడు. కానీ అది సరిగ్గా నడవకపోవడంతో.. అధిక సంపాదన కోసం నకిలీ కారం విక్రయాలు దందా మొదలు పెట్టాడు. ఈ వ్యాపారం కోసం ఉస్మాన్ గంజ్ లోని తన ఇంట్లోనే కారం ఫ్లోర్ మిల్, సీలింగ్, ప్యాకింగ్ యంత్రాలను పెట్టుకున్నాడు. ఇక మార్కెట్లో తక్కువ నాణ్యత కలిగిన మిర్చీలను కొనుగోలు చేసి.. వాటి నుంచి తీసిన కారం పొడికి రంగులు, రసాయనాలు కలిపి అధిక మొత్తలో కారం తయారు చేసేవాడు. ఆ తర్వాత ఆ కారం పొడిని.. స్థానిక ఏజెంట్ల నుంచి కొనుగోలు చేసిన స్వస్తిక్ బ్రాండ్ కారం ప్యాకెట్లట్లో నింపి విక్రయిస్తున్నారు. Also Read : అమెరికా ఎన్నికల్లో 'జై బాలయ్య'.. వైరల్ అవుతున్న బ్యాలెట్ పేపర్ ఈ దందా పై పూర్తి సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రూపారామ్ ఖత్రీ ఇంటిపై దాడిచేశారు. రూపారామ్ ఇంట్లో నిల్వ ఉంచిన 30 కిలోల తాలు మిర్చి పౌడర్, స్వస్తిక్ బ్రాండ్ కవర్లు, రంగులు, సీలింగ్ యంత్రాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. Also Read: సాయి పల్లవి అలా అనడంతో మనసు ముక్కలైంది.. శివ కార్తికేయన్ మాటలు వింటే షాక్ Also Read:యంగ్ రైటర్స్, డైరెక్టర్స్ కు ప్రభాస్ ఓపెన్ ఆఫర్.. మీ దగ్గర మంచి కథ ఉందా? #Fake chilli powder #Swasik #Central zone task force మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి