/rtv/media/media_files/2025/02/06/Aqkj8odOv8tp7ZIzc8Ky.jpg)
AP Cabinet decided mid-day meal with thin rice
AP News: బడి పిల్లలకు ఇకపై సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది. విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన క్యాబినేట్ మీటింగ్ జరిగింది. ఇందులో నాణ్యమైన, పోషకాలు కలిగిన సన్న బియ్యం( ఫైన్ రైస్)తో మధ్యాహ్న భోజన పథకం అమలు చెయ్యాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్‌లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై ఆసక్తికర చర్చ జరిగింది. మోనూలో తీసుకొచ్చిన మార్పుల గురించి క్యాబినెట్‌లో లోకేష్ వివరించారు. ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినే విధంగా మెనూలో తీసుకొచ్చిన మార్పుల గురించి క్యాబినెట్ లో ప్రస్తావించారు.
క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..
సన్న బియ్యం (ఫైన్ రైస్ ) అందిస్తే మరింత క్వాలిటీతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని క్యాబినెట్ ముందు ప్రస్తావించారు. ఇందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సహకారం కావాలని నారా లోకేష్ కోరారు. మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనను మంత్రులు బలపరచి అంగీకరించారు. లోకేష్ ప్రతిపాదనకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన నాణ్యమైన పోషకాలు కలిగిన సన్న బియ్యం పౌరసరఫరాల శాఖ వద్ద అందుబాటులో ఉంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంత్రులకు తెలిపారు.
లోకేష్ ప్రతిపాదనతో ఇకపై చిన్నారులకు మరింత నాణ్యమైన భోజనం అందిచనున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన పోషకాలు కలిగిన సన్న బియ్యం సరఫరా చేసేందుకు అంగీకరించిన పౌర సరఫరాల శాఖ మంత్రిని లోకేష్ కొనియాడారు. మీ చొరవతో పిల్లలకి పౌష్టిక ఆహారం అందుతుందని లోకేష్‌కు సహచర మంత్రుల అభినందనలు తెలిపారు.
ఇది కూడా చదవండి: Buddha Venkanna: జగన్ ఓ పశుపతి.. బుద్దా వెంకన్న షాకింగ్ కామెంట్స్!