Sajjala Bhargav Reddy: వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జి సజ్జల భార్గవ్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయనపై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. ఆయనతో పాటు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వర్రా రవీంద్రారెడ్డి, అర్జున్ రెడ్డిలపై మరో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అసభ్యకర పోస్టులు తొలగించాలని కోరగా కులం పేరుతో దూషిస్తూ చంపుతామని బెదిరించారంటూ సిద్ధవటం మండలం ఎస్.రాజంపేట గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త వెంకటాద్రి ఈ నెల 8వ తేదీన నందలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తాజాగా ఈ కేసు నందలూరు నుంచి పులివెందులకు బదిలీ చేశారు అధికారులు. ఇప్పటికే సజ్జలపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: లోదుస్తులు ధరించి నిద్రించకూడదా?.. అసలు నిజం ఏంటి?
హైకోర్టులో దక్కని ఊరట...
తనపై నమోదు అయిన కేసుల నుంచి కాస్త ఉపశనం కోసం హైకోర్టును ఆశ్రయించారు సజ్జల భార్గవ్ రెడ్డి. ఈ కేసుల్లో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను వేశారు. కాగా దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం సజ్జల భార్గవ్‌కు షాక్ ఇచ్చింది.హైకోర్టులో ఆయనకు ఊరట దక్కలేదు. దీనిపై విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. BNS చట్టం అమలులోకి రాకముందు నేరం జరగడంతో చట్టం 111 వర్తించదని కోర్టులో భార్గవ్ తరఫున లాయర్ వాదనలు వినిపించారు. ఏ సెక్షన్లు వర్తిస్తాయో లోతుగా విచారించాలని హైకోర్టు సూచించింది.
ఇది కూడా చదవండి: తిరుపతిలో ఘోర ప్రమాదం...ఇద్దరు మహిళలు మృత్యువాత
కాగా ఇప్పటికే సోషల్ మీడియాలో అధికార పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే పలువురిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే కేసులో సజ్జల భార్గవ్ పెయిన్ కడప పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సజ్జల భార్గవ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: భోజనం తర్వాత ఇలా చేశారంటే లివర్ పాడైపోతుంది