Kurnool Breaking : కర్నూల్ లో మరో ప్రమాదం.. స్పాట్ లో  ఒకరు మృతి...మరో 12 మందికి గాయాలు

కర్నూల్‌ జిల్లాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఎమ్మిగనూరులో ఆటోను తుఫాన్ వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో రంగవేణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో 12 మందికి గాయాలయ్యాయి. మహిళా కూలీలతో వెళుతున్న ఆటోను తుఫాన్‌ వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

New Update
Another accident in Kurnool.. One person died on the spot

Another accident in Kurnool.. One person died on the spot

Kurnool Breaking : కర్నూల్‌ జిల్లాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఎమ్మిగనూరులో భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రంగవేణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో 12 మందికి గాయాలయ్యాయి. పత్తి ఏరే మహిళా కూలీలతో వెళుతున్న ఆటోను కర్టాటకకు చెందిన తుఫాన్‌ వాహనం వెనుకనుండి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆదోని మండలం కపాటి గ్రామానికి చెందిన పత్తి కూలీలు మంత్రాలయం మండలం కల్లు దేవకుంటకు పత్తి ఏరేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు