EC:హరియాణా ఎన్నికలు..కాంగ్రెస్ ఆరోపణలు నిజం కావు–ఈసీ

హరియాణాలో జరిగిన ఎన్నికల్లో అతకతవకలు జరిగాయన్న కాంగ్రెస్ వాదనను ఈసీ తోసిపుచ్చింది. కాంగ్రెస్ ఇంతకు ముందు కూడా ఇలానే ఆరోపణలు చేసిందంటూ వ్యాఖ్యలు చేసింది.

New Update
EC: వాటికి ప్రస్తుతానికి విశ్రాంతినిచ్చి...వచ్చే సారికి మొదలు పెట్టండి...ఈవీఎంల గురించి ఈసీ సెటైర్లు!

 Haryana Election Results: 

ఓ జాతీయ పార్టీ నుంచి ఇలాంటి ఆరోపణలు ఊహించలేదు అంటోంది ఈసీ. హరియాణా ఎన్నికల లెక్కింపు సమయంలో అవతవకలు చోటు చేసుకున్నాయన్న కాంగ్రెస్ ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. కాంగ్రెస్ ఎప్పుడూ ఇలానే చేస్తోందని...ఇంతకు ముందు కూడా ఎన్నికల ఫలితాల విశ్వసనీయతపై సందేహాలను లేవనెత్తిందని విమర్శించింది. దేశంలో ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో భాగంగా రాజకీయ పార్టీలు పంచుకునే అభిప్రాయాలను ఎన్నికల సంఘం స్వీకరిస్తోంది. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదుల పరిష్కారానికి కట్టుబడే ఉంటాం అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఈసీ లేఖ రాసింది. కానీ కాంగ్రెస్ ఎలాంటి ఆధారాలు చూపకుండా ఎన్నికల ప్రక్రియలో రాజీ పడ్డారని చెబుతున్నారని తెలిపింది. గతంలో మాదిరిగా సాధారణ సందేహాలనే కాంగ్రెస్‌ లేవనెత్తిందని.. వారి విధానాలను మార్చుకోవాలని సూచించింది.

హరియాణాలో కాంగ్రెస్ గెలుస్తుందని అందరూ భావించారు. సర్వేలు కూడా కాంగ్రెస్‌కే అనుకూలంగా వచ్చాయి. కానీ ఫలితాల్లో బీజేపీ గెలిచింది. దీంతో కాంగ్రెస్ ఫలితాల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఈసీని రివ్యూ చేయాలని కోరింది. హరియాణా ఎన్నికల ఫలితాలు అంగీకరించమని...తమ విజయాన్ని బలవంతంగా లాక్కున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ క్రమంలోనే ఈసీని కలిసి ఫిర్యాదు చేసింది. 

Also Read: Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం..12 మంది మృతి

Advertisment
Advertisment
తాజా కథనాలు