Flights: ఆగని బాంబు బెదిరింపులు..ఈరోజు 32 ఎయిర్ ఇండియా విమానాలకు

నిందితులను పట్టుకున్నామని చెబుతూనే ఉన్నారు కానీ విమానాలకు బాంబుల బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. ఈరోజు మళ్ళ 32 ఎయిర్ ఇండియా ఫ్లైట్లకు బాంబు బెదిరింపు మెసేజ్‌లు వచ్చాయి. ఇవి కూడా నకిలీవే అని తేలింది. 

New Update
DGCA: ఎయిర్‌పోర్టులో వీల్‌చైర్‌ లేక వృద్ధుడు మృతి.. ఎయిర్‌ ఇండియాకు భారీ జరిమానా

Bomb Thretning to Air India Flights: 

విమానయాన సంస్థలకు నకిలీ బాంబు బెదిరింపులు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. ఏం చేసినా బూటకపు మెసేజ్‌ల వెల్లువ ఆగడం లేదు. దాదాపు రెండు వారాలుగా దేశంలోని అన్ని ఎయిర్‌లైనర్లకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఈ రోజు కూడా 32 ఎయిర్ ఇండియా విమానాలకు బెదిరింపులు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 400కి పైగా విమానాలకు బెదిరింపు మెసేజ్‌లు వచ్చాయి. వీటిల్లో డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్ విమానాల వరకూ అన్ని రకాల ఫ్లైట్‌లూ ఈ బెదిరింపులను ఎదుర్కుంటున్నాయి. ఈ కాల్స్ నేపథ్యంలో కేంద్రం ఏజెన్సీలు అత్యున్నత దర్యాప్తు జరుపుతున్నాయి. ప్రయాణికుల భద్రత కోసం భద్రతా సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి.

ఈ బెదిరింపుల కారణంగా ఫ్లైట్ ఏజెన్సీలు విపరీతమైన నష్టాన్ని చవిచూస్తున్నాయి. దానికి తోడు విమానాలు ఆలస్యం అవడం, కొన్ని క్యాన్సిల్ కూడా అవుతున్నాయి.  దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇలా బెదిరింపులకు పాల్పడే వారిని ‘‘నో ఫ్లై’’ లిస్టులో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రూల్స్ ఉల్లంఘిస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరిస్తే థర్డ్ పార్టీ కంటెంట్‌ను ఆయా ప్లాట్‌ఫామ్‌లు తీసుకునే వెసులుబాటు నిలిపివేస్తామని స్పష్టం చేసింది. ఇటీవల వివిధ ఎయిర్‌లైన్స్‌కు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్స్ రావడం వల్ల పలు విమాన సర్వీసులు కూడా ఆలస్యమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది. 

Also Read: Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం..12 మంది మృతి

Advertisment
Advertisment
తాజా కథనాలు