AP: వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులకు షాక్

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు, వాలంటీర్లుకు కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. గత ప్రభుత్వం వార్తాపత్రికల కోసమని కేటాయించిన రూ.200 అలవెన్సును ప్రభుత్వం రద్దు చేసింది.

AP : నేడు ఏపీ కొత్త టెట్‌ నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే!
New Update

AP Government : ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు, వాలంటీర్లుకు కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. గత ప్రభుత్వం వార్తాపత్రికల కోసమని కేటాయించిన రూ.200 అలవెన్సును ప్రభుత్వం రద్దు చేసింది.  గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు ఉచితంగా న్యూస్‌పేపర్లు సరఫరా చేయాలని నిర్ణయించి దానికి ప్రభుత్వం అదనంగా రూ.200 అలవెన్సు ఇచ్చేది.

Also Read: దసరా వేళ టీజీఆర్టీసీ తీపి కబురు..ఇక నుంచి ఇంటింటికి..!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత‌ ఈ అదనపు అలవెన్సులు రద్దు చేసింది.  ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ అలవెన్సుల పేరుతో ఆర్థిక దుర్వినియోగం జరుగుతోందన్నారు. అందుకే ఇటీవల కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలుకు అందించే సాయాన్నిఆపేయాలనే ప్రతిపాదనల్ని ఆమోదించింది. దీనికి సంబంధించి తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

#nda #ap-government #ap-election-2024 #news-paper
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe