Ap Govt: ఏపీ ప్రభుత్వం ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులు- నైతికత- విలువల సలహాదారు పదవిలో కేబినెట్ హోదాతో నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఆ పదవిని స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలోనే చాగంటి కోటేశ్వరరావు పూర్తిస్థాయిలో బాధ్యతల్ని స్వీకరించనున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. Also Read: Uthappa: మాజీ క్రికెటర్ ఉతప్పకు భారీ షాక్..అరెస్ట్ వారెంట్ జారీ చాగంటి కోటేశ్వరరావుకుమరో కీలకమైన బాధ్యతలు అప్పగించింది. రెండు రోజుల క్రితం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఏపీ నైతికత విలువల ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుతో ప్రత్యేకంగా పుస్తకాలు రూపొందించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఈ పుస్తకాలను చాగంటితో పుస్తకాలను రూపొందించి పంపిణీ చేయనున్నారు. Also Read: CBN: జగన్ కు చంద్రబాబు బర్త్ డే విషెస్.. ఏమని ట్వీట్ చేశారో తెలుసా? విద్యార్థులు- నైతికత- విలువల సలహాదారుగా ఏపీ ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావును నియమించింది.. ఆయన కూడా ఈ పదవిని స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పిల్లలకు ఉపయోగపడే నాలుగు మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ పదవిని అంగీకరించినట్లు చాగంటి తెలిపారు. పిల్లల్లో నైతిక విలువల్ని పెంపొందించే కీలకమైన బాధ్యతల్ని తనకు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నాను అన్నారు. Also Read: Ap School Holidays: ఏపీలో భారీ వర్షాలు..స్కూళ్లకు సెలవులు పదవుల కోసం తాను అంగీకరించలేదని.. తాను చెప్పే మాటలతో పిల్లలకు మేలు జరిగితే అదే చాలన్నారు. అంతకుమించి తనకు ఆనందం ఏముంటుందని.. ఈ కారణంతోనే తాను సంతోషంగా అంగీకరించినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంపొందించే ప్రయత్నం చేయాలని.. ఆ మేరకు కృషి చేయాలని చాగంటికి చంద్రబాబు సూచించారు. నైతిక విలువులు పెంచే దిశగా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టాలని.. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో వీటిని నిర్వహించాలన్నారు. Also Read: Ap: ఏపీ మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారీగా మద్యం ధరలు తగ్గింపు