ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కార్యాలయంలో మంత్రిమండలి సమావేశం కానున్నారు. మొదటి రోజు సమావేశాల్లో పూర్తి స్థాయిలో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఇది కూడా చూడండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత..
మొత్తం 10 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏపీలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. జులైలో ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నవంబర్ వరకు నాలుగు నెలల పాటు తాత్కాలిక బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తీసుకున్నారు. ఇప్పటివరకూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉంది. ఇది ఈ నెలాఖరుతో ముగిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఈ రోజు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని.. యువకుడు చేసిన పనికి అంతా షాక్!
బడ్జెట్ విడుదల చేసిన తర్వాత సమావేశాలు వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. బడ్జెట్, సూపర్ సిక్స్ వంటి పథకాల గురించి చర్చించనున్నారు. అలాగే భూముల విషయంలో అక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రస్తుతం ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టం 1982 వల్ల కావడంలేదు. దీన్ని రద్దు చేసి మళ్లీ కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు 2024ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Alert: హైదరాబాద్ వాసులు బి అలెర్ట్...ఈ ఏరియాల్లో వాటర్ బంద్!
నిజానికి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాదిలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు వెళుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఆర్థిక పరిస్థితి పై స్పష్టత వచ్చేందుకు గడువు తీసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వం తెలిపింది. దీనికి అనుగుణంగానే ఏపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడంతో పాటు కీలక బిల్లులు సభ ముందుకు వచ్చేందుకు అవకాశం ఉంది.
ఇది కూడా చూడండి: దారుణం.. టీచర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ నీట్ విద్యార్థిపై..