పొలంలో పిడుగుపాటు.. దంపతులు మృతి
పిడుగుపాటుతో భార్యాభర్తలలు ప్రాణాలు కోల్పోయిన ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం దిగువగంగంపల్లి తండాలో చోటుచేసుకుంది. పొలంలో పని చేస్తుండగా పిడుగు పడడంతో దసరా నాయక్ (51), దేవీబాయి (46) దంపతులతో పాటు వారి రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి.