పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ కు గురైన సంఘటన అంబేద్కర్ కోనసీమజిల్లాలో చోటుచేసుకుంది. మలికిపురం మండలం తూర్పుపాలెం గ్రామంలో బాలిక కిడ్నాప్ అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేశనపల్లి హైస్కూల్లో బాలిక(15) పదో తరగతి చదువుతుంది. మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది కూడా చదవండి : Ap Crime: అనకాపల్లిలో ..ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య ఇది కూడా చదవండి: నందమూరి ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. మోక్షజ్ఞ మూవీ వాయిదా..? తూర్పుపాలెం గ్రామంలో చికెన్ షాపులో పనిచేస్తున్న దుర్గ బాలికను కిడ్నాప్ చేసినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దుర్గ బాలికకు స్వయానా మేనమామ. నమ్మకంగా ఉంటూ తమ కుమార్తెను కిడ్నాప్ చేశారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తు్న్నారు. కిడ్నాప్ ఎందుకు చేశారని వివరాలు సేకరిస్తున్నారు. కిడ్నాపర్ల నుంచి తమ కూతురును కాపాడాలంటూ తల్లిదండ్రులు ప్రాధేయపడుతున్నారు.