అల్లు అర్జున్ మామ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా సంధ్య థియేటర్ ఘటనపై స్పందించారు. తొక్కిసలాట తర్వాతి రోజే హీరో గానీ, నిర్మాత గానీ బాధిత ఇంటికి వెళ్లి పరామర్శిస్తే బాగుండేదని అన్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. చట్టం ముందు ఎంత పాపులారిటీ ఉన్నా పనికిరాదన్నారు. అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చడం కరెక్ట్ కాదంటూ మాట్లాడారు. Also Read: యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్ పవన్‌పై అంబటి సెటైర్ పవన్ ఈ ఘటనపై స్పందించిన అనంతరం వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు పవన్‌పై సెటైర్ వేశారు. సంఘటన జరిగిన 27 రోజుల తరువాత నోరు మెదిపి.. మీ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నందుకు సంతోషం అని వ్యంగ్యంగా ట్వీట్ పెట్టారు. సంఘటన జరిగిన 27 రోజులతరువాత నోరు మెదిపిమీ నిజస్వరూపాన్నిబయట పెట్టుకున్నందుకు, సంతోషం.@PawanKalyan — Ambati Rambabu (@AmbatiRambabu) December 30, 2024 ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై పవన్ అభిమానులు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. అందులో ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. 11 రోజులకి నోరు మెదిపితే బాగుండేది ఏమో? అని రాసుకొచ్చాడు. మరొకరేమో.. రాష్ట్ర ప్రజలు అన్ని నిశితంగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుంది అని రాసుకొచ్చాడు. Also Read: ఆరోజు 'పుష్ప' నిర్మాతలే థియేటర్ తీసుకున్నారు.. నోటీసులపై సంధ్య థియేటర్ రిప్లై ఇంతకీ పవన్ ఏమన్నారంటే? తొక్కిసలాట తర్వాతి రోజే హీరో గానీ, నిర్మాత గానీ బాధిత ఇంటికి వెళ్లి పరామర్శిస్తే బాగుండేది. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు. మేము ఉన్నామనే నమ్మకం ముందే కలిగిస్తే ఇంతవరకు వచ్చేది కాదు. చట్టం ముందు ఎంత పాపులారిటీ ఉన్నా.. పనికిరాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానంలో నేను ఉన్నా అదే చేసే వాడిని. తన కారణంగానే ఒకరు చనిపోయారనే వేదన అల్లు అర్జున్ లో ఉంది. Also Read : నా అసలు పేరు అదికాదు.. ఆ ఇన్సిడెంట్ తో పేరు మార్చుకున్నా : రెజీనా కసాండ్రా కానీ, సినిమా అంటే టీమ్ .. అందులో అందరి భాగస్వామ్యం ఉంటుంది. అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చడం కరెక్ట్ కాదు. గతంలో చిరంజీవి కూడా అభిమానులతో కలిసి చూసేందుకు థియేటర్ కి వెళ్లేవారు.. కాకపోతే ఆయన ముసుగు వేసుకొని ఒక్కరే వెళ్లేవారు" అని అన్నారు పవన్ కళ్యాణ్. అలాగే పవన్ కళ్యాణ్ ఈ ఘటనకు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. "తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గొప్ప నాయకుడు. Also Read : 'సలార్' కు ఫస్ట్ నన్నే అడిగారు.. కానీ? స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ కింది స్థాయి నుంచి పైకి వచ్చారు. వైసీపీ తరహాలో అక్కడ వ్యవహరించలేదు.. ఆ రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు, టికెట్ ధరల పెంపుకు అవకాశమిచ్చారు అంటూ రేవంత్ ప్రభుత్వం ప్రశంసలు కురించారు. అల్లు అర్జున్ విషయంలో తెర వెనుక, తెర ముందు ఏం జరిగింది అనేది నాకు పూర్తిగా తెలియదు. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టను.. ప్రజల భద్రత గురించే వారు ఆలోచిస్తారు. థియేటర్ స్టాఫ్ కూడా అల్లు అర్జున్ కి ముందే చెప్పాల్సి ఉండేది'' అని అన్నారు.