ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి రైల్వే ప్రాజెక్టుకు ఇటీవల కేంద్రం ఆమోదం తెలిపింది. దాదాపు రూ.2,245 కోట్లతో 56.63కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయనుంది. ఈ కొత్త రైల్వే లైన్ అనేది అమరావతి నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్ కలకతాకు అనుసంధానం చేస్తుంది.
Also Read: నవంబర్ లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు!
57 కి.మీ మేర రైల్వే లైన్
కాగా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు ఈ రైల్వే లైన్ 37 కి.మీ దూరం ఉంటుంది. అదే సమయంలో పెదకూరపాడు, సత్తెనపల్లి లైన్లు కూడా కలుపుకుంటే మొత్తం 57 కి.మీ ఉంటుంది. ఈ రైల్వే ట్రాక్ నిర్మాణానికి దాదాపు 450 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంటుంది.
Also Read: కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...30 మంది!
ఈ భూమిని ఖమ్మం, కృష్ణా, గుంటూరు, పల్నాడు వంటి జిల్లాల్లో సేకరించనున్నారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఎర్రుపాలెంలోని రైల్వేస్టేషన్ సమీపం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా పెద్దాపురం వరకు భూమిని సేకరిస్తారు. ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ను ప్రభుత్వం నియమించింది.
Also read: లెబనాన్ పై విరుచుకుపడిన ఇజ్రాయెల్...కూలిన భారీ భవనాలు!
ఇప్పుడు ఈ రైల్వే నిర్మాణం పనుల కోసం చకచక అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ రైల్వే ట్రాక్ కోసం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని రెండు గ్రామాల్లో భూసేకరణ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎర్రుపాలెం మండలంలోని ఎర్రుపాలెం, కేశిరెడ్డి పల్లి గ్రామాల్లో దాదాపు 24.01 ఎకరాల భూమిని సేకరించాలని రైల్వేశాఖ తెలిపింది.
Also Read: తిరుపతిలో దారుణం...మూడున్నరేళ్ల చిన్నారి పై అత్యాచారం..ఆపై చంపి..!
దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే 30 రోజుల లోపు ఖమ్మం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు లికిత పూర్వకంగా అందించాలని కోరింది. ఆపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించింది. ప్రస్తుతానికి ఈ రైల్వే లైన్ ను సింగిల్ ట్రాక్ గానే తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అవసరాలకు అనుగుణంగా డబ్లింగ్, ట్రిప్లింగ్ గా విస్తరించే అవకాశం ఉందని సమాచారం.