/rtv/media/media_files/2025/10/30/adita-swapna-appointed-as-national-observer-of-andhra-pradesh-mahila-congress-2025-10-30-11-31-45.jpg)
Adita Swapna appointed as national observer of Andhra Pradesh Mahila Congress
National Observer : ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ జాతీయ పరిశీలకురాలిగా బి. అదిత స్వప్న నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి ఆల్కా లాంబా ఆదేశాల మేరకు అదిత స్వప్నను అబ్జర్వర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఇంతకు ముందు ఆమె బీహార్, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ ప్రాంతాలకు నేషనల్ అబ్జర్వర్‌గా విజయవంతంగా సేవలందించారు. ఆమె సమర్థత, కట్టుబాటు, మరియు స్ఫూర్తిదాయకమైన నాయకత్వం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతను కూడా అప్పగించారు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/10/30/ap-woman-congress-2025-10-30-11-52-36.jpeg)
ఈ సందర్భంగా బి. అదిత స్వప్న మాట్లాడుతూ“ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి ఆల్కా లాంబా నాపై ఉంచిన నమ్మకానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆమె నాయకత్వంలో మహిళా కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తూ, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తాను. ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్‌ను ప్రతి మండలం, బూత్ స్థాయికి చేర్చడమే నా లక్ష్యం,” అని అన్నారు.
రాష్ట్రంలోని ప్రతి మండలం మరియు బూత్ స్థాయిలో మహిళా కాంగ్రెస్ ఉనికిని విస్తరించడంపై దృష్టి పెడతామని” మహిళా నాయకులకు సాధికారత కల్పించడం, సంస్థాగత చట్రాన్ని బలోపేతం చేయడం మరియు రాజకీయాల్లో మహిళల సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కోసం అఖిల భారత మహిళా కాంగ్రెస్ తన ప్రయత్నాలను కొనసాగిస్తోందని అన్నారు.
కాగా మహిళా కాంగ్రెస్ జాతీయ స్థాయిలో బలమైన కేడర్, సమాన హక్కుల సాధన, మహిళా నాయకత్వ వికాసానికి కృషి చేస్తోంది. అదిత స్వప్న నియామకం ఈ దిశలో మరో బలమైన అడుగు అని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Follow Us