/rtv/media/media_files/2024/11/30/KqTfZX8a1Gen56yJSDX1.jpg)
AP Crime
AP Crime: ఏపీలో మహిళల భద్రతకు రక్షణ లేదని కొందరూ నేతలు ఆరోపిస్తున్న మటలను వినే ఉంటాము. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. వారిపై జరుగుతున్న దాడులు ఆగడం లేదు. తాజాగా అలాంటి ఘటన విశాఖపట్నంలో కలకలం రేపుతోంది. ఆర్టీసీ సిటీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. క్షతగ్రాతులను దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మహిళలపై యాసిడ్ దాడి చేసి పరార్:
విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటన గిరిజాలకు వెళుతున్న బస్సులో ఐటీఐ జంక్షన్ వద్ద జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు గగ్గోలు పెట్టడంతో డ్రైవర్ వెంటనే బస్సును ఆపి.. స్థానికుల సాయంతో బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Also Read: కుమురంభీంలో విషాదం.. పులి పంజాకు యువతి బలి
ప్రమాదంపై సమాచారం అందుకున్న కంచరపాలెం సీఐ చంద్రశేఖర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. దాడిలో ఉపయోగించినది నిజంగానే యాసిడ్..? ఇతర ద్రావణమా అనే దానిపై పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. ఘటన స్థానికులలో తీవ్ర కలకలం రేపుతోంది. బాధితుల ఆరోగ్య పరిస్థితి పట్ల ఇంకా స్పష్టత రాలేదు.బస్సు డ్రైవర్.. బాధితులు ఇచ్చిన సమాచారం ఘటనా ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. యాసిడ్ దాడి మహిళలే లక్ష్యంగా చేశారా.? లేదా అజ్ఞాత వ్యక్తి అకతాయి పని చేశాడా..? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ దాడి వెనుక కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు కేసు నమోదు చేసి వివరాలపై ఆరా తీస్తున్నారు.
Also Read: అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి దుర్మరణం!
Also Read: మేనమామ కాదు కాలయముడు..ఆస్తి కోసం దారుణం
Also Read: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడిక్కడే మృతి!