Andhra Pradesh: టీడీపీ నేత బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్.. కడప జిల్లా జైలుకు తరలింపు..

టీడీపీ నేత బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్ విధించారు కడప జిల్లా కోర్టు న్యాయమూర్తి. కడప విమానాశ్రయం వద్ద ఘర్షణ కేసు, టికెట్ బెట్టింగ్ కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అర్థరాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు.

New Update
Andhra Pradesh: టీడీపీ నేత బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్.. కడప జిల్లా జైలుకు తరలింపు..

Andhra Pradesh:మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పులివెందుల నియోజకవర్గం ఇన్‌ఛార్జి బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్ విధించింది కడప జిల్లా కోర్టు. దీంతో ఆయన్ను కడప జైలుకు తరలించారు పోలీసులు. రవిపై కడప విమానాశ్రయం వద్ద ఆందోళన కేసుతో పాటు.. టికెట్ బెట్టింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. బెట్టింగ్ కేసులో తాజాగా ఆయనకు 41 ఏ నోటీసులు జారీ చేశారు. అయితే, ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదే విషయాన్ని కడప జిల్లా న్యాయమూర్తికి తెలియజేశారు పోలీసులు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్ విధించారు. కాగా మొదట రవి రిమాండ్ రిపోర్ట్‌ను న్యాయమూర్తి వెనక్కి పంపించారు. అర్థరాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో.. ఇవాళ కడప కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించారు. 10 నెలల క్రితం జరిగిన ఘటనలో ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి? ఇన్ని రోజులు ఏం చేశారు? అంటూ పోలీసులను ప్రశ్నించారు న్యాయమూర్తి. దాంతో.. రవిపై బెట్టింగ్ కేసులో 41 ఏ నోటీసులు జారీ చేసినట్లు వివరించారు పోలీసులు.

కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిళ నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభించడానికి రెండు రోజుల ముందు జనవరి 25వ తేదీన కడపలో పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా లోకేష్‌కు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులతో కలిసి విమానాశ్రయం వద్దకు వచ్చారు బీటెక్ రవి. అయితే, విమానాశ్రయంలో వెల్లడానికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఆ సందర్భంగా పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. పోలీసులు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనపై వల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు, ప్రస్తుతం బెట్టింగ్ కేసులో బీటెక్ రవిని ఇప్పుడు అరెస్ట్ చేశారు పోలీసులు.

Also Read:

నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు.. ఇవాళే చివరి తేదీ.. అప్లై చేశారా?

ముగిసిన ఐటీ సోదాలు.. మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో ‘కోట్ల’ కట్టలు..

Advertisment
తాజా కథనాలు