ఏపీ హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ (Justice Dheeraj Singh Takor) శుక్రవారం (28-07-2023) రోజున ప్రమాణ స్వీకారం చేశారు.జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌తో ఏపీ గవర్నర్ (AP Governor) అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు.ప్రమాణం చేసిన అనంతరం నూతన ప్రధాన న్యాయమూర్తికి పుష్పగుచ్ఛం ఇచ్చి గవర్నర్‌ శుభాకాంక్షలు తెలిపారు.జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను శాలువా పుష్పగుచ్ఛంతో సీఎం జగన్‌ (CM Jagan) సన్మానించారు.

ఏపీ హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌
New Update

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ (AP CJ Justice Dheeraj Singh Takor) ప్రమాణ స్వీకారం చేశారు.  విజయవాడ తుమ్మలపల్లి (Thummalapally) కళాక్షేత్రంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్  అబ్దుల్‌ నజీర్‌ (Governor Abdul Nazeer) ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం జగన్‌, సీజేకు పుష్ఫగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ప్రమాణం చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు పత్రాలపై సంతకాలు  చేశారు.

జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..

ఏపీ సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ సొంత రాష్ట్రం జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir). బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ పదోన్నతిపై ఏపీ హైకోర్టుకు (AP High Court) వచ్చారు. ఆయన 1964 ఏప్రిల్‌ 25న జన్మించారు.  సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ (TS Tagore)కి ఆయన సోదరుడు.1989 అక్టోబరు 18న ఢిల్లీ,జమ్మూకశ్మీర్‌ బార్‌ కౌన్సిల్‌లో (Bar Council) న్యాయవాదిగా నమోదై 2011లో సీనియర్‌ న్యాయవాదిగా పదోన్నతి  పొందారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 2013లో అక్కడి హైకోర్టుకు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు.2022 జూన్‌ నుంచి బాంబే హైకోర్టు జడ్జిగా కొనసాగారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు,ఉన్నతాధికారులు హాజరు

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను కొలీజియం సిఫార్సు  చేసింది.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన 2026 ఏప్రిల్‌ 24న పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జమ్మూ కశ్మీర్‌ రాష్ట్ర కోటా నుంచి న్యాయమూర్తులెవరూ లేరు.కాబట్టి ఈలోగా ఆయన పదోన్నతిపై సుప్రీంకోర్టుకు (Supreme  Court) వెళ్లే ఛాన్స్‌ ఉంది. ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ACJ)గా వ్యవహరిస్తున్న జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి (Justice Akula Venkata Sesha Sai) ఇకపై నంబర్‌-2గా కొనసాగుతారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు,మంత్రులు,ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu) వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

#vijayawada #chandrababu #ap-cm-jagan #andra-pradesh #ap-governor #ap-cj
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe