Andhra Pradesh : ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు

ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఐపీఎస్ ద్వారకా తిరుమల రావు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం ఈయన ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు.

New Update
Andhra Pradesh : ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు

AP New DGP : 1989 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ద్వారకా తిరుమల రావు (Dwaraka Tirumala Rao) ను నూతన డీజీపీ (DGP) గా నియమించింది ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కొద్ది సేపటి క్రితమే జారీ చేసింది.
ప్రస్తుతం తీరుమలరావు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు.

ఎన్నికల ముందు వరకు ఏపీ డీజీపీగా రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల ముందు ఆయనపై ఈసీ వేటు వేసింది. బాధ్యతల నుంచి తప్పించింది. నూతన డీజీపీ గా హరీష్ గుప్తాను నియమించింది. ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ (TDP) ప్రభుత్వం.. భారీగా అధికారుల బదిలీలను చేపట్టింది. సీఎస్ గా నీరభ్ కుమార్ ను నియమించింది. ఈ రోజు ఏకంగా 29 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ క్రమంలో డీజీపీగా ద్వారకా తిరుమలరావు ను నియమించింది. రానున్న రోజుల్లో మరిన్ని బదిలీలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

publive-image

Also Read:UGC NET: యూజీసీ నెట్ రద్దు.. పరీక్ష అయిన మర్నాడే

Advertisment
Advertisment
తాజా కథనాలు