Nagababu Double Votes Issue: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్న రెండు చోట్ల ఓట్ల వ్యవహారంపై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పందించారు. నెల్లూరులో ఆదివారం ప్రెస్‌మీట్ పెట్టిన నాగబాబు.. ఓట్లపై క్లారిటీ ఇచ్చారు. తనకు రాజకీయ పదవులపై ఏమాత్రం ఇంట్రస్ట్ లేదన్నారు. తాను ఎంపీగా పోటీ చేస్తున్నాని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. తనకు రెండు ఓట్లు ఉన్నాయనేది ఒక కామెడీ ఇష్యూ అని కొట్టిపరేశారు. తనకు ఫిలింనగర్‌లో ఓటు ఉందని, తెలంగాణ ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులు ఎవరూ ఓటు వినియోగించుకోలేదన్నారు నాగబాబు. తాను మంగళగిరికి వచ్చేయడంతో ఇక్కడికి ఓటు మార్పు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నామని క్లారిటీ ఇచ్చారు నాగబాబు. తానొక్కడినే కాదని, తన కుటుంబ సభ్యులు సైతం ఓటు మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు నాగబాబు. తెలంగాణలో తమకు ఉన్న ఓటును క్యాన్సిల్ చేసుకున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన, టీడీపీకి ఓటు వేస్తానని ఖరాకండిగా చెప్పారు నాగబాబు.
జనసేన-టీడీపీ నేతల మధ్య విభేదాలు..
ఇదే సమయంలో జనసేన-టీడీపీ నేతల మధ్య విభేదాలపై స్పందించారు నాగబాబు. ఒకటి రెండు చోట్ల నేతల మధ్య విభేదాలు ఉండొచ్చని, అవన్నీ త్వరలోనే సర్దుకుంటాయని అభిప్రాయపడ్డారు నాగబాబు. నెల్లూరు జిల్లాలో జనసేన నుంచి తమ అభ్యర్థి పోటీ చేస్తారని స్పష్టం చేశారాయన. కాగా, సమయం లేకపోవడం వల్లే.. అక్రమ గ్రావెల్‌పై సోమిరెడ్డి చేస్తున్న దీక్షకు తాను వెళ్లలేకపోయానని క్లారిటీ ఇచ్చారు నాగబాబు.
వైసీపీ ఆ స్థానంలో ఉండాలి..
ఏపీలో వైసీపీదే మళ్లీ అధికారం అని కలలు కంటున్నారని సెటైర్లు వేశారు నాగబాబు. వైసీపీ నేతలు వై నాట్ 175 అంటున్నారు.. మేము వై నాట్ వైసీపీ జీరో అంటామన్నారు. నిజమైన నాయకుడు ఎవరూ ప్రతిపక్షం ఉండకూడదు అనే ఆలోచన చేయకూడదని అభిప్రాయపడ్డారు. ఆ కారణంగానే వచ్చే ఎన్నికల్లో వైసీపీ 20 నుంచి 25 సీట్లతో ప్రతిపక్షంలో ఉండాలని కోరుకుంటామన్నారు నాగబాబు.
Also Read:
నిరుద్యోగులకు అలర్ట్.. భృతి పొందాలంటే అర్హతలివే..!
సీఎం ఆఫర్‌పై స్పందించిన నళిని.. సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన..