ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయని.. ఇటీవల ఎంపీ రఘురామకృష్ణ రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఏపీ హైకోర్టు విచారణ చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌తో పాటు పలువురు మంత్రులు, అధికారులకు కలిపి మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల వెనుక ఆర్థిక అవతవకలు చోటుచేసుకుంటున్నాయని.. ఈ వ్యవహారంపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని రఘురామకృష్ణ రాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Also read: విశాఖ బోటు ప్రమాద బాధితులకు నష్టపరిహరం.!
అయితే ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ దీనిపై వాదనలు వినిపించారు. ప్రజాప్రయోజనం లేకుండానే వ్యక్తిగత ఉద్దేశంతో పిటిషన్ వేశారని కోర్టుకి తెలిపారు. పిటిషన్‌కు విచారణ అవసరం లేదన్నారు. మరోవైపు పిటిషన్ వేసిన అనంతరం ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని పిటిషన్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది.
Also read: ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ