![ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Chandrababu-Health-jpg.webp)
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR Case) అలైన్మెంట్ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై ఈ రోజు న్యాయస్థానం విచారణ నిర్వహించింది. చంద్రబాబు తరఫున న్యాయవాదుల వాదనలు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. స్కిల్ డవలప్మెంట్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో ఇతర కేసులపై ఆయన లాయర్లు దృష్టి సారించారు. మరో వైపు చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంలో సవాల్ చేసింది ఏపీ సీఐడీ.
ఈ వార్త అప్డేట్ అవుతోంది..