Vizag Metro: విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో నిర్మాణ పనులకు ముహూర్తం ఫిక్స్..! విశాఖ వాసులకు శుభవార్త. మెట్రో నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీన మెట్రో రైల్ నిర్మాణ పనులకు పునాది వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ మెట్రో కార్పొరేషన్‌తో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.. కీలక చర్చలు జరిపారు. By Shiva.K 05 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Vizag Metro Project: విశాఖ వాసులకు శుభవార్త. మెట్రో నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీన మెట్రో రైల్ నిర్మాణ పనులకు పునాది వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ మెట్రో కార్పొరేషన్‌తో(AP Metro Corporation) ప్రభుత్వం చర్చలు జరుపుతోందని సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.. కీలక చర్చలు జరిపారు. మెట్రో నిర్మాణానికి డీపీఆర్ పూర్తయినా.. మెట్రో వయబుల్ కాని రూట్లలో అధునానత ట్రామ్‌కు కూడా డీపీఆర్ సిద్ధం చేయాలని ఏపీ మెట్రో కార్పొరేషన్‌ను ఆదేశించారు జవహార్ రెడ్డి. అలాగే మెట్రో నిర్మాణానికి నిధుల సమీకరణ చేపట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు వడివడిగా అడుగులు వేస్తోంది సర్కార్. అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా ప్రజా రావాణా డెవలప్‌మెంట్‌పై దృష్టి కేంద్రీకరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే.. మెట్రో రైలు నిర్మాణంపై దృష్టి సారించింది ప్రభుత్వం. 2024 జనవరి 14వ తేదీన మెట్రో రైలు పనులకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిపాదిన మెట్రో ట్రైన్ రూట్, వివరాలు.. ఈ ప్రాజెక్టులో భాగంగా 4 కారిడార్లు, 42 స్టేషన్లను నిర్మించనున్నారు. 1. కారిడార్-1: 34.40 కిలో మీటర్లతో, స్టీల్ ప్లాంట్ గేట్ నుండి కొమ్మాది జంక్షన్ వరకు విస్తరించనున్నారు. 2. కారిడార్-2: గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు ను కలుపుతూ 5.07 కిలో మీటర్లు లైన్ వేయనున్నారు. 3. కారిడార్-3: తాటిచెట్లపాలెం నుండి చిన్న వాల్తేరు వరకు 6.75 కిలో మీటర్ల మేర నడవనుంది. 4. కారిడార్-4: కొమ్మాదికి నుండి భోగాపురం విమానాశ్రయం వరకు లైన్ వేయనున్నారు. ఈ నాలుగు కారిడార్లు సమిష్టిగా 42 స్టేషన్లు, రెండు డిపోలతో సమగ్ర మెట్రోను సృష్టించే విధంగా డీపీఅర్‌ను సిద్ధం చేశారు. Also Read: CM’s Breakfast Scheme: ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్.. శుక్రవారం నుంచే ప్రారంభం.. Harish rao: 23 కోట్లతో 50 పడకల సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ బ్లాక్.. మంత్రి హరీశ్‌రావు వరాల జల్లు! #andhra-pradesh #andhra-pradesh-news #visakha #vishakapatnam #visakha-metro-train #vizag-metro మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి