సిద్దిపేటలో మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నూతనంగా నిర్మించిన 1,000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించారు రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ రఘుతం రెడ్డి, సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు, అడిషనల్ కలెక్టర్ గిరిమ అగర్వాల్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, సూపరింటెండెంట్, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
పూర్తిగా చదవండి..Harish rao: 23 కోట్లతో 50 పడకల సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ బ్లాక్.. మంత్రి హరీశ్‌రావు వరాల జల్లు!
ప్రాథమిక చికిత్స నుంచి ప్రాణాంతక వ్యాధుల వరకు అన్ని వైద్య సేవలు అందిస్తున్నమని చెప్పారు హరీశ్‌రావు. ఒకప్పుడు మనం నీళ్లు చూడనోళ్లం..కానీ ఇప్పుడు కరువు ఎరగనోల్లమని చెప్పుకొచ్చారు. సిద్దిపేట జిల్లా చేసుకున్నామని.. సిద్దిపేటకు గోదావరి నీళ్లు తెచ్చుకున్నామని.., సిద్దిపేట కి రైల్ కూడా తెచ్చుకున్నామన్నారు హరీశ్‌రావు. ఒక ప్రాంతానికి కావాలిసిన కలలను సాకారం చేసుకున్నామని చెప్పామన్నారు. వేయి పడకల ఆస్పత్రి మనకు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
Translate this News: