Andhra Pradesh: పిఠాపురంలో హైటెన్షన్.. వంగా గీతను అడ్డుకున్న జనసేన కార్యకర్తలు

పిఠాపురం నియోజకవర్గం విరవలో హైటెన్షన్‌ నెలకొంది. వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. వైసీపీ అభ్యర్ధి వంగా గీతను జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Andhra Pradesh: పిఠాపురంలో హైటెన్షన్.. వంగా గీతను అడ్డుకున్న జనసేన కార్యకర్తలు
New Update

Andhra Pradesh Elections 2024:

పిఠాపురంలో గొడవలు సద్దుమణగడం లేదు. ఉదయం అంతా ఈవీఎంలు సరిగ్గా పనిచేయక, అభ్యర్థుల పోటోలు కనిపించక రచ్చ అయితే ఇప్పుడు వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య గొడవ అయింది. వైసీపీ అభ్యర్థి వంగా విశ్వనాథ్‌ను జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయనతో పాటు వైసీపీ అభ్యర్ధి వంగా గీతను కూడా వారు అడ్డుకున్నారు. గీతా విశ్వనాథ్‌కు వ్యతిరేకంగా జనసైనికుల ఆందోళన చేశారు. దీంతో ఇరు వర్గాలకు మధ్య కాసేపు గొడవ అయింది. వంగాగీత పోలింగ్ కేంద్రం దగ్గర ప్రచారం చేస్తున్నారని...అందుకే అడ్డుకున్నామని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. గొడవ ఎక్కువ అవుతుండడంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.

మరోవైపు పిఠాపురం మండలం గోకవాడలోనూ జనసైనికుల నిరసన చేపట్టారు. జనసేన సానుభూతిపరుల ఓట్లు తొలగించారని ఆందోళన చేశారు. యు.కొత్తపల్లి మండలం నాగులపల్లి,ఇసుకపల్లి గ్రామాల్లో కూడా జనసేన - వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ నాయకుడు వడిశెట్టి నారాయణరెడ్డిని జనసైనికులు అడ్డుకున్నారు. నారాయణ రెడ్డి కారును జనసేన కార్యకర్తలు వెంబడించారు.

Also Read:Vizag: ఉదయం వెళ్ళాల్సిన రైలు సాయంత్రంకు..వెయ్యి ఓట్లు గల్లంతు

#andhra-pradesh #ycp #tdp #rtv #ap-elections-2024 #pithapuram #pitha-puram
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe