Andhra Pradesh: GPS జీవో, గెజిట్ విడుదలపై ఏపీ సీఎంవో సీరియస్ తమ పర్మిషన్ లేకుండా జీపీఎస్ జీవో, గెజిట్ విడుదలపై ఏపీ సీఎంవో సీరియస్ అయ్యింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు దీనిపై సీఎంవో దర్యాప్తు చేస్తోంది. ఆర్థిక, న్యాయ శాఖల్లో పనిచేసే వాళ్లలో దీనికి ఎవరు కారకులు అనే దానిపై ఆరా తీస్తోంది. By B Aravind 17 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి తమ పర్మిషన్ లేకుండా జీపీఎస్ జీవో, గెజిట్ విడుదలపై ఏపీ సీఎంవో సీరియస్ అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ విషయంపై సీఎంవో దర్యాప్తు చేస్తోంది. ఆర్థిక, న్యాయ శాఖల్లో పనిచేసే వాళ్లలో దీనికి ఎవరు కారకులు అనే దానిపై ఆరా తీస్తోంది. ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ శాంతి కుమారీ, న్యాయ శాఖ సెక్షన్ ఆఫీసర్ హరిప్రసాద్ రెడ్డి పాత్రపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఇద్దరు అధికారులకు సంబంధించి గత చరిత్రను అధికారులు వెలికితీస్తున్నారు. అధికారులిద్దరూ నిబంధనలు పాటించారా ?.. లేదా ? అని విచారిస్తున్నారు. అయితే బిజినెస్ నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రాథమిక నిర్దారణలో తేలింది. Also Read: నా బిడ్డకు తండ్రి అతనే.. లైవ్ లో శాంతి, మదన్ మాటల యుద్ధం! రూల్స్ ప్రకారం.. చివరి ఆరు నెలల్లో పాత ప్రభుత్వంలో అమలు చేయని నిర్ణయాల పైళ్లను కొత్త ప్రభుత్వం ముందుకు తీసుకురావాలి. అమల్లో లేని పాత ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసేందుకు కొత్త ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ తప్పనిసరి అని బిజినెస్ నిబంధనల్లో ఉందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. అయితే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం రోజు జీవో జారీ చేయడం.. సరిగ్గా నెల రోజుల తర్వాత గెజిట్ అప్‌లోడ్ చేయడంపై కుట్ర కోణం ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివిధ శాఖల్లో, మంత్రులు, అధికారుల పేషీల్లో ఎవరైనా కోవర్టులు ఉన్నారా అనేదానిపై కూడా సీఎంవో ఆరా తీస్తోంది. Also read: అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి భార్య ఉషా చిలుకూరి.. ఏపీలో మూలాలు! #telugu-news #andhra-pradesh-news #cm-chandrababu #ap-cmo #gps-go మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి