Andhra Pradesh: చంద్రబాబుపై బెయిల్‌పై సుప్రీంకోర్టుకు సీఐడీ..

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది సీఐడీ. బెయిల్ మంజూరు విషయంలో హైకోర్టు తన పరిధి దాటి తీర్పునిచ్చిందని భావిస్తోంది సీఐడీ. ఈ విషయాన్ని సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామంటున్నారు సీఐడీ అధికారులు.

Andhra Pradesh: చంద్రబాబుపై బెయిల్‌పై సుప్రీంకోర్టుకు సీఐడీ..
New Update

Chandrababu Bail: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు ఏపీ హైకోర్టు బెయిల్(High Court) మంజూరు చేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది ఏపీ సీఐడీ(AP Government). స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు రెగ్యూలర్ బెయిల్ పిటిషన్‌పై గత కొన్ని రోజులుగా హైకోర్టులో విచారణ జరుగుతోంది. పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన విచారణలో.. తాజాగా ఆయనకు పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. కంటి శస్త్ర చికిత్స కోసం మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్‌ను పూర్తిస్థాయి బెయిల్‌గా మారుస్తున్నట్లు హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తాత్కాలిక బెయిల్‌ సందర్భంగా జారీచేసిన బెయిల్‌ బాండ్‌ ఆధారంగా చంద్రబాబును విడుదల చేయాలని ఆదేశించింది కోర్టు. అదే విధంగా తాత్కాలిక బెయిల్ మంజూరు సందర్భంగా చంద్రబాబుపై కొన్ని ఆంక్షలు విధించింది కోర్టు. ఇప్పుడు ఆ ఆంక్షలను హైకోర్టు సడలించింది.

అయితే, ఈ కేసులో హైకర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది సీఐడీ. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఉందని సీఐడీ భావిస్తోంది. అంతేకాదు.. ఆధారాల విషయంలోనూ హైకోర్టు తన పరిధి దాటిందని, దర్యాప్తు కొనసాగుతుండగానే పరిధి దాటి కామెంట్స్ చేసిందన సీఐడీ పాయింట్స్ రైజ్ చేస్తోంది. బెయిల్ పిటిషన్ విచారణను అడ్డం పెట్టుకుని చంద్రబాబు దర్యాప్తు జరుగకుండా చేశారని, సీఐడీ కోరిన ఏ వివరాలనూ అందజేయలేదని చెబుతోంది సీఐడీ. బెయిల్ పిటిషన్ విషయంలో హైకోర్టు అసాధారణంగా వ్యవహరించిందని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేసింది సీఐడీ.

Also Read:

నిరుద్యోగులకు కేటీఆర్ సంచలన హామీ.. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే..

ఆ ఒక్కడికీ తప్ప అందరికీ రెస్ట్.. ఆసిస్ తో టీ20 సిరీస్ కెప్టెన్ గా సూర్య!

#chandrababu #andhra-pradesh-news #ap-high-court #supreme-court-of-india #andhra-pradesh-cid #chandrababu-bail-issue
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe